WI vs AUS 3rd ODI: రెచ్చిపోయిన ఆసీస్..సొంతగడ్డపై విండీస్ వీరులకు పరాభవం

బ్రిడ్జిటౌన్: వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయాన్ని సాధించింది. రెండో వన్డేలో ఓటమికి ప్రతీకారాన్ని తీర్చుకుంది. దీనితో పాటు మూడు వన్డేలో సిరీస్‌నూ కైవసం చేసుకుంది. రెండో వన్డేలో ఎదురైన పరాజయం నుంచి కోలుకున్న ఆస్ట్రేలియా జట్టు.. విండీస్‌పై పూర్తి ఆధిపత్యాన్ని కనపరిచింది. ప్రత్యేకించి- ఆసీస్ బౌలర్లు రెచ్చిపోయారు. తక్కువ స్కోరుకే కరేబియన్లను కట్టడి చేశారు. అనంతరం బ్యాట్స్‌మెన్లు కూడా రాణించారు. వెస్టిండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని 30 ఓవర్లలోనే ఛేదించారు.

టాప్ ఆర్డర్ టపటపా

టాప్ ఆర్డర్ టపటపా

ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. అలెక్స్ క్యారీ సారథ్యంలోని ఆసీస్ జట్టు విండీస్‌తో టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్‌లను ఆడింది. వన్డే సిరీస్‌ను విజయంతో ముగించింది. బ్రిడ్జ్‌టౌన్ వేదికగా సాగిన చివరిదైన మూడో వన్డేలో వెస్టిండీస్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు.. 45.1 ఓవర్లలో 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఎవిన్ లెవిస్ తప్ప ఎవరూ కుదురుగా బ్యాటింగ్ చేయలేకపోయారు.

ఆదుకున్న లోయర్ ఆర్డర్..

ఆదుకున్న లోయర్ ఆర్డర్..

ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి లెవిస్ తప్ప టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు ఏ మాత్రం క్రీజ్‌లో నిలవలేకపోయారు. 75 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయింది. లెవిస్ ఒక్కడే ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనగలిగాడు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 66 బంతుల్లో అయిదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ షై హోప్-14, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ డారెన్ బ్రావో-18, కేప్టెన్ కీరన్ పొల్లార్డ్-11, అల్జరీ జోసెఫ్-15 మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు.

పేస్.. స్పిన్ అటాక్..

పేస్.. స్పిన్ అటాక్..

షిమోన్ హెట్మయిర్, నికొలస్ పూరన్, జేసన్ హోల్డర్ వంటి స్టార్లు సింగిల్ డిజిట్ దాటలేదు. రెండో వన్డేలో చెరో అర్ధసెంచరీతో జట్టును గెలిపించిన నికొలస్ పూరన్, జేసన్ హోల్డర్‌ మూడో మ్యాచ్‌లో చేతులెత్తేశారు. నికొలస్ పూరన్-3, జేసన్ హోల్డర్-5, షిమోన్ హెట్మయిర్-6 పరుగులు మాత్రమే చేశారు. ఆసీస్ బౌలర్లు సమష్టిగా తడాఖా చూపారు. బౌలర్లందరూ వికెట్లను పడగొట్టారు. మిఛెల్ స్టార్క్-3, హేజిల్‌వుడ్-2, అష్టన్ అగర్-2, ఆడమ్ జంపా-2, అష్టన్ టర్నర్ ఒక వికెట్ పడగొట్టారు.

తక్కువ పరుగులకే..

తక్కువ పరుగులకే..

50 ఓవర్లలో 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్ కూడా ఏకపక్షంగా సాగలేదు. వెస్టిండీస్ బౌలర్లు వరుస వికెట్లను తీశారు. ఆసీస్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. ఓపెనర్లు జోష్ ఫిలిప్-10, హెన్రిక్స్ ఒక పరుగుకే అవుట్ అయ్యారు. స్కోర్ బోర్డు మీద 27 పరుగులు చేరే సరికి ఆస్ట్రేలియా రెండు వికెట్లను కోల్పోయింది. వంద పరుగుల్లోపు నలుగురు బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ చేరారు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్, కేప్టెన్ అలెక్స్ క్యారీ 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. మిఛెల్ మార్ష్-29 పరుగులు చేశారు.

హాఫ్ సెంచరీతో..

హాఫ్ సెంచరీతో..

మిడిల్ ఆర్డర్‌లో మాథ్యూ వేడ్, అష్టన్ అగర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో వేడ్ 52 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 పరుగులతో ఇన్నింగ్ చివరి వరకూ నిలిచాడు. అగర్-19 రన్స్ చేశాడు. ఛేదించాల్సిన లక్ష్యం తక్కువగా ఉండటం, రిక్వైర్డ్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో ఆస్ట్రేలియా పెద్దగా టెన్షన్ పడలేదు. నింపాదిగా ఆడుతూ మ్యాచ్‌ను ముగించింది. విండీస్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్, అకీల్ హెోసెన్, అల్జరీ జోసెఫ్, హెడేన్ వాల్ష్ ఒక్కో వికెట్ పడగొట్టారు. దీని తరువాత ఆస్ట్రేలియా జట్లు బంగ్లాదేశ్ పర్యటనకు బయలుదేరి వెళ్తుంది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, July 27, 2021, 8:22 [IST]
Other articles published on Jul 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X