WI vs AUS: నికొలస్ పూరన్..జేసన్ హోల్డర్ ప్రతాపం: ఆసీస్ ఖాతాలో మరొకటి

బ్రిడ్జిటౌన్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ ఘన విజయాన్ని సాధించింది. వెస్టిండీస్ సపోర్టింగ్ స్టాఫ్ ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్ రావడం వల్ల వాయిదా పడిన ఈ మ్యాచ్..ఆ దేశ కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. తొలి వన్డేలో భారీ తేడాతో ఓడిపోయిన వెస్టిండీస్ జట్టు.. బౌన్స్ బ్యాక్ అయింది. బలమైన ఆస్ట్రేలియా జట్టును స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ ప్రారంభంలో కొంత తడబడినప్పటికీ..మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ నికొలస్ పూరన్ కుదురుకోవడంతో మళ్లీ గాడిన పడింది. నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

 టాప్ ఆర్డర్ టపటపా

టాప్ ఆర్డర్ టపటపా

ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. అలెక్స్ క్యారీ సారథ్యంలోని ఆసీస్ జట్టు విండీస్‌ను ఢీ కొంటోంది. ఈ రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ ముగిసింది. ఇక వన్డే ఇంటర్నేషనల్స్ ఆరంభం అయ్యాయి. తొలి వన్డేలో దారుణ పరాజయాన్ని చవి చూసింది కరేబియన్ టీమ్. రెండో వన్డేలో ప్రతీకారాన్ని తీర్చుకుంది. బ్రిడ్జిటౌన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. 47.1 ఓవర్లలో 187 పరుగులు మాత్రమే చేయగలిగింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు రాణించడం వల్ల ఆస్ట్రేలియా ఆ మాత్రం స్కోరయినా చేయగలిగింది.

ఆదుకున్న లోయర్ ఆర్డర్..

ఆదుకున్న లోయర్ ఆర్డర్..

వెస్టిండీస్ బౌలర్ ధాటికి ఓపెనర్లు సహా, టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు ఏ మాత్రం క్రీజ్‌లో నిలవలేకపోయారు. వంద పరుగుల్లేపే ఏడు వికెట్లను కోల్పోయింది ఆసీస్. లోయర్ ఆర్డర్‌లో ఆడమ్ జంపా, వెస్ అగర్ రాణించడంతో ఆ మాత్రం పరుగులను స్కోర్‌బోర్డు‌పై చేర్చగలిగింది. జట్టు స్కోరు ఒక పరుగు వద్దే తొలి వికెట్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టును బౌలర్లు ఆదుకున్నారు. ఓపెనర్ బెన్ మెక్‌డెర్మట్ సున్నాకే అవుటయ్యాడు. మరో ఓపెనర్ జోష్ ఫిలిప్ 16 పరుగులకు పెవిలియన్ చేరాడు. మిఛెల్ మార్ష్-8, మొయిజెస్ హెన్రిక్స్-4, కేప్టెన్ కమ్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ-10, అష్టన్ టర్నర్-1 పరుగులు చేశారు.

 బౌలర్ దూకుడు బ్యాటింగ్..

బౌలర్ దూకుడు బ్యాటింగ్..

మిడిల్ ఆర్డర్‌లో మాథ్యూ వేడ్-36, మిఛెల్ స్టార్క్-19, ఆడమ్ జంపా-36 పరుగులతో జట్టు పరువు నిలిపారు. బౌలర్ వెస్ అగర్ దూకుడుగా ఆడాడు. 36 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 41 పరుగులు చేశాడు. 47.1 బంతుల్లో 187 పరుగులు చేసి ఆలౌట్ అయింది ఆస్ట్రేలియా టీమ్. విండీస్ బౌలర్లు అల్జరీ జోసెఫ్, అకీల్ హొసెన్ మూడు చొప్పున వికెట్లు తీశారు. షెల్డన్ కాట్రెల్ రెండు వికెట్లు పడగొట్టగా.. జేసన్ హోల్డర్, హెడెన్ వాల్ష్ తలో వికెట్ తీసుకున్నారు.

తడబడినా.. నిలబడింది..

తడబడినా.. నిలబడింది..

188 పరుగుల లక్ష్యంతో క్రీజ్‌లోకి దిగిన వెస్టిండీస్ టీమ్ తడబడింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ ఒక పరుగుకే అవుట్ అయ్యాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ డారెన్ బ్రావో ఖాతా తెరవలేకపోయాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జేసన్ మహమ్మద్ 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. పించ్ హిట్టర్ కీరన్ పొల్లార్డ్ సైతం రెండు పరుగులకే అవుట్ కావడంతో సొంతగడ్డపై వెస్టిండీస్‌కు మరో పరాభవం తప్పదనిపించింది. అప్పటికే క్రీజ్‌లో ఉన్న నికొలస్ పూరన్ సమయస్ఫూర్తితో ఆడాడు. 43 బంతుల్లో ఆరు ఫోర్లతో 38 పరుగులు చేసిన హోప్ అవుటైన తరువాత మళ్లీ కష్టాల్లో పడినట్టు కనిపించినప్పటికీ.. జేసన్ హోల్డర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు.

IPL 2021 : West Indies Cricketers దేశం కోసం ఆడటం మానేశారు | Oneindia Telugu
 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా

69 బంతుల్లో 52 పరుగులు చేసిన హోల్డర్ స్టార్క్‌కు ఎల్బీగా వికెట్‌ను సమర్పించుకున్నాడు. అప్పటికే లక్ష్యానికి సమీపించడం, రిక్వైర్డ్ రన్‌రేట్ తక్కువగా ఉండటంతో విండీస్ నింపాదిగా లక్ష్యాన్ని అందుకుంది. 38 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 191 పరుగులు చేసింది. నికొలస్ పూరన్ 75 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 59 పరుగులు చేసి.. నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లు మిఛెల్ స్టార్క్-3, ఆడమ్ జంపా-2, టర్నర్ ఒక వికెట్ తీసుకున్నారు. నికొలస్ పూరన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇదే బ్రిడ్జి‌టౌన్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మూడో డే/నైట్ వన్డే సోమవారం ప్రారంభమౌతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, July 25, 2021, 8:02 [IST]
Other articles published on Jul 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X