క్రికెట్ మొదలెట్టిన చోటే ప్రేమను బయటపెట్టా..: ఇది రోహిత్ శర్మ ప్రేమ కథ
హైదరాబాద్: 'నా చెల్లిని చూడకు' అని వార్నింగ్ ఇచ్చిన యువరాజ్ సింగ్‌యే ఇప్పుడు తన బావ. వార్నింగ్ వల్ల వచ్చిన కోపంతో ఆ రోజంతా విసుగ్గా చూసిన అమ్మాయే తన భార్య. 'ఇంతే రోహిత్ శర్మ ప్రేమ కథ.

యాడ్ లొకేషన్‌లోనే కలిశా
విరాట్, అనుష్కల ప్రేమాయాణం తెలిసిందే కదా. షాంపూ యాడ్‌లో కలవడం. స్నేహం చిగురించడం. కొన్నేళ్ల ప్రేమ, పంతంతో విడిపోవడం, ప్రేమతో మళ్లీ దగ్గరవడం, విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకోవడం. రోహిత్ శర్మ ప్రేమ కథ కూడా ఇలాంటిదే కానీ, అంతా ఇలా కాదు. వాళ్ల లాగే. వీళ్లు కూడా యాడ్ లొకేషన్‌లోనే కలిశారు.

కోపం తెచ్చుకున్న రోహిత్ శర్మ
యువరాజ్ సింగ్ ఓ ప్రైవేట్ యాడ్ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. దానిలో భాగంగానే అక్కడికి రోహిత్ శర్మ కూడా వచ్చాడు. యువరాజ్ సింగ్ పక్కన ఉన్న అమ్మాయి రితికని చూడటం మొదలుపెట్టాడు. దానిని గమనించిన యువరాజ్ సింగ్ ఆమె నా సిస్టర్‌లాంటిది. ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునేది లేదని వారించాడు. దాంతో కోపం తెచ్చుకున్న రోహిత్ శర్మ చిరాకుతో కూడిన అసూయ తెచ్చుకుని మళ్లీ చూడటం మొదలుపెట్టాడు.

క్రికెట్ మొదలుపెట్టిన చోటే ప్రేమను బయటపెట్టా..
రోహిత్ ఎక్కడైతే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడో అక్కడే రితికకు తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. ‘ముంబైలోని బోరివలి స్పోర్ట్స్ క్లబ్‌లో రితికకు ప్రపోజ్ చేశా. నా 11వ ఏట ఇక్కడే క్రికెట్ ఆటడం మొదలుపెట్టాను. అందుకే రితికకు అక్కడే నా ప్రేమ విషయం చెప్పాలనుకున్నా' అని రోహిత్ తెలిపాడు.

కోపమంతా ఎగిరిపోయిందట.
ధ్యాసంతా చేసే యాడ్ మీద లేకుండా ఉండటంతో ఆ రోజు ప్రదర్శన సరిగా చేయలేకపోయాడట. దానికి కారణం కూడా రితికేనని తిట్టుకున్నాడట. సరిగ్గా అలా విసుక్కుంటున్న తరుణంలో రితిక వచ్చి ఏదైనా సమస్యా.. నన్ను సాయం చేయమంటారా.. అని అడిగే సరికి ఆ కోపమంతా ఎగిరిపోయిందట.

రితిక ఉండాల్సిందే
కట్ చేస్తే.. మంచి ఫ్రెండ్స్, లవర్స్, ఇప్పుడు భార్యభర్తలు. ఇలా వాళ్లు ప్రేమలో ఉన్నప్పుడు రితికకు వంట రాదని రోహిత్‌యే చేసి తినిపించేవాడని కూడా చెప్పుకొస్తున్నాడు ఈ తాత్కాలిక టీమిండియా సారథి. లవర్స్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరగడం కాదు. ఇప్పటికీ రోహిత్ ఎక్కడికి వెళ్లినా అతనితోపాటు రితిక ఉండాల్సిందేనట.

డబుల్ సెంచరీని బహుమతిగా
ఈ నేపథ్యంలోనే పెళ్లి రోజు కూడా స్టేడియంకి వచ్చిన భార్య రితికకు రోహిత్ శర్మ డబుల్ సెంచరీని బహుమతిగా ఇచ్చాడంటూ రోహిత్ అభిమానులు తెగపొగిడేస్తున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications