Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ కుర్రాడిని అప్పుడే తీసిపారేస్తారా?: తెలుగోడికి అండగా నిలిచిన ఆంధ్రా టైగర్!

IND vs NZ: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన తెలుగు ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి.. బ్యాటింగ్‌లో 20 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయాడు. ఈ నేపథ్యం నితీష్‌పై జరుగుతున్న నెగెటివ్ ట్రోలింగ్‌ను టీమిండియా వెటరన్ బ్యాటర్ హనుమ విహారి తీవ్రంగా ఖండించారు.

హనుమ విహారి ఘాటు స్పందన
ఆంధ్ర జట్టులో నితీష్‌తో కలిసి ఆడిన అనుభవం ఉన్న విహారి, 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా నితీష్‌కు మద్దతు ప్రకటించారు. "ప్రస్తుతం దేశంలో నితీష్ స్థాయిలో బ్యాటింగ్ చేస్తూ, సీమ్ బౌలింగ్ చేయగల మరో ఆటగాడు ఎవరైనా ఉన్నారా? అతనికి కేవలం 22 ఏళ్లు మాత్రమే. ఇంత చిన్న వయసులోనే అతడిని అరకొర క్రికెటర్ అని పిలుస్తూ.. అప్పుడే తీసిపారేస్తారా?" అని విమర్శకులను ప్రశ్నించారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించాల్సింది పోయి, ఇలాంటి విమర్శలు చేయడం సరికాదని విహారి అభిప్రాయపడ్డారు.

Why Write Him Off So Early Hanuma Vihari Backs Nitish Kumar Reddy After Criticism

కోచ్ అసహనం.. విహారి ప్రశ్న
మరోవైపు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోష్చేట్ నితీష్ ప్రదర్శనపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. "నితీష్‌కు అవకాశాలు ఇస్తున్నప్పటికీ.. అతను వాటిని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవట్లేదు. రాజ్‌కోట్ వన్డేలో 15 ఓవర్ల పాటు క్రీజులో ఉండే అవకాశం వచ్చింది, అటువంటి ఛాన్స్‌లను వాడుకుంటేనే జట్టులో స్థానం సుస్థిరం అవుతుంది" అని డోష్చేట్ పేర్కొన్నారు. అయితే జట్టు మేనేజ్‌మెంట్ నితీష్‌ను బౌలర్‌గా ఎందుకు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని విహారి ప్రశ్నించారు. కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ ఇవ్వడం వల్ల అతని సామర్థ్యాన్ని ఎలా అంచనా వేస్తారని విమర్శించారు.

రాజ్‌కోట్ వన్డేలో నితీష్ ప్రదర్శన
రాజ్‌కోట్ వన్డేలో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లో 21 బంతుల్లో 20 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 2 ఓవర్లలో వికెట్లు తీయకుండా 15 పరుగులు ఇచ్చాడు.

Story first published: Thursday, January 15, 2026, 16:40 [IST]
Other articles published on Jan 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+