Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ లేని టెస్టు జట్టు: ఎందుకో వివరణ ఇచ్చిన ఐసీసీ

హైదరాబాద్: 2016 సంవత్సరానికి గాను ఐసీసీ వార్షిక అవార్డులను గురువారం ప్రకటించింది. ఈ అవార్డుల్లో అశ్విన్ పంట పండింది. ప్లేయర్‌గా ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచి ప్రతిష్ఠాత్మక సర్‌ గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో పాటు ఐసీసీ టెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌నూ సొంతం చేసుకున్నాడు.

అయితే ఈ ఏడాది టెస్టుల్లో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీకి ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ టెస్టు జట్టులో చోటుదక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది 12 టెస్టులాడిన కోహ్లీ 1215 ప‌రుగులు చేశాడు. ఇటీవలే ఇంగ్లాండ్‌తో ముగిసిన ఐదు టెస్టుల సిరీస్‌లో 655 పరుగులతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా కూడా నిలిచాడు.

అంతేకాదు ఒక కేలండ‌ర్ ఇయ‌ర్‌లో మూడు డ‌బుల్ సెంచ‌రీలు చేసిన తొలి భార‌త కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. అయినప్పటికీ ఐసీసీ మాత్రం కోహ్లి పేరును ప‌రిగ‌ణించ‌క‌పోవ‌డంపై సోషల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ టెస్టు జట్టులో భారత్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడికే చోటు దక్కింది.

టెస్టు జట్టుకు కెప్టెన్‌గా అలెస్టర్ కుక్

ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నలుగురు, ఇంగ్లాండ్ ఆటగాళ్లు నలుగురు, భారత్‌, శ్రీలంక, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా తరపున ఒక్కొక్కరు చొప్పున చోటు దక్కించుకున్నారు. ఐసీసీ అత్యుత్తమ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా అలెస్టర్ కుక్ ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ 12వ ఆటగాడిగా ఐసీసీ ఎంపిక చేసింది.

ట్విట్ట‌ర్‌లో అభిమానులు ఆగ్ర‌హం

అయితే కోహ్లిని టెస్టు జట్టు నుంచి త‌ప్పించ‌డంపై అభిమానులు ట్విట్ట‌ర్‌లో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వివరణ ఇచ్చింది. 2015, సెప్టెంబర్‌ 14 నుంచి 2016, సెప్టెంబర్‌ 20 మధ్య ప్రదర్శన ఆధారంగా జరిగిన ఓటింగ్‌ ద్వారా అవార్డులను ప్రకటించారు.

సెప్టెంబ‌ర్ 14, 2015 నుంచి సెప్టెంబ‌ర్ 20, 2016 వ‌ర‌కు మ‌ధ్య ప్రదర్శన

ఐసీసీ టెస్టు జట్టును క్రికెట్ మాజీ దిగ్గజాలైన రాహుల్ ద్రవిడ్, కుమార సంగక్కర, గ్యారీ కిరెస్టన్‌లు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ప్ర‌తి ఏడాది సెప్టెంబ‌ర్ నుంచి 12 నెల‌ల కాలంలో ప్లేయ‌ర్స్ పర్ఫార్మెన్స్‌ను చూస్తామ‌ని ఐసీసీ పేర్కొంది. ఐసీసీ అవార్డుల కోసం సెప్టెంబ‌ర్ 14, 2015 నుంచి సెప్టెంబ‌ర్ 20, 2016 వ‌ర‌కు మ‌ధ్య ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న‌ను ఐసీసీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది.

కోహ్లీ 45.10 యావరేజితో 451 పరుగులు మాత్రమే

కోహ్లీ 45.10 యావరేజితో 451 పరుగులు మాత్రమే

ఈ క్రమంలో 8 టెస్టులాడిన విరాట్ కోహ్లీ 45.10 యావరేజితో 451 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ కంటే కూడా మిగతా వారు మెరుగైన యావరేజితో పాటు ఎక్కువ పరుగులు చేశారు. అందుచేతనే కోహ్లీకి ఐసీసీ అత్యుత్తమ టెస్టు జట్టులో చోటు లభించలేదని వివరణ ఇచ్చింది.

12వ ఆటగాడిగా ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్

ఐసీసీ తీసుకున్న నిర్ణీత కాలపరిమితిలో 66.93 యావరేజితో 4 సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ 12వ ఆటగాడిగా ఐసీసీ ఎంపిక చేసింది. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ 2016 సంవత్సరానికి ఐసీసీ వన్డే జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐసీసీ ఎంపిక చేసిన వన్డే జట్టులో టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు కూడా చోటు దక్కింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+