హైదరాబాద్: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. క్రికెటర్లు, ప్రముఖుల పుట్టినరోజులకు తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ ట్విట్టర్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు. అయితే తాజాగా, సెహ్వాగ్ చేసిన ఓ ట్వీట్‌పై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌కు సెహ్వాగ్ తెలిపిన జన్మదిన శుభాకాంక్షల తీరుపై అభిమానులు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీశాంత్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆ ట్వీట్‌లో హాస్యం లేదని నిరాశ చెందారు. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందంటే...

'హ్యాపీ బర్త్‌డే శ్రీశాంత్. ఎంజాయ్!' అని మాత్రమే సెహ్వాగ్ ట్వీట్ చేస్తూ... 2007 టీ20 ప్రపంచకప్‌లో ఔట్ కోసం అప్పీలు చేస్తున్న శ్రీశాంత్ ఫోటోను ఈ సందర్భంగా పోస్ట్ చేశాడు. సెహ్వాగ్ ట్వీట్లలో హాస్య చతురతకు అలవాటు పడ్డ ఫ్యాన్స్ సాదాసీదాగా ఉండటంతో ట్విట్టర్‌లో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇంతకు ముందు గౌతమ్ గంభీర్ పుట్టిన రోజున సెహ్వాగ్ సాధారణంగా ట్వీట్ చేయడంతో 'సెహ్వాగ్.. మీ నుంచి ఇంకాస్త ఆశించా. గమ్మత్తుగా' అని అర్థం వచ్చేలా సాక్షాత్తూ గౌతీనే బదులిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం (ఫిబ్రవరి 5) టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ 27వ పుట్టినరోజుని జరుపుకున్నాడు. భువీ పుట్టినరోజు సందర్భంగా సెహ్వాగ్ తనదైశ శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాదు భువనేశ్వర్ బౌలింగ్‌లో గొప్పదనాన్ని భార్యల మూడ్‌తో పోల్చుతూ సెహ్వాగ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.