టెస్టు క్రికెట్‌కే తొలి ప్రాధాన్యత: బేడీని చూసి భయపడిన కోహ్లీ
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టులపై తనకున్న అభిమానాన్ని మరోసారి ప్రదర్శించాడు. సంప్రదాయ టెస్టు క్రికెట్‌తోనే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను కాపాడుకోగల్గుతామని విరాట్ కోహ్లీ అన్నాడు. ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దిగ్గజ క్రికెటర్లు, ఢిల్లీ మాజీ కెపెన్లు బిషాన్‌సింగ్ బేడీ, మొహిందర్ అమర్‌నాథ్, వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు.

టెస్టు క్రికెట్టే అత్యుత్తమ ఫార్మాట్
ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నా దృష్టిలో టెస్టు క్రికెట్టే అత్యుత్తమ ఫార్మాట్. క్రికెట్‌లో టెస్టు ఫార్మాట్ స్థానం అగ్రస్థానంలో ఉండాలి. అప్పుడే ఈ ఆటకు ఢోకా ఉండదు. టెస్టులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టమని ఈతరం కుర్రాళ్లకు నా సలహా' అని కోహ్లి అన్నాడు. గతంలో ఢిల్లీ జట్టుకు ఆడిన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు.


ఆయన శిక్షణ విషయంలో చాలా కఠినంగా
‘నేను అండర్-14, అండర్-16 మ్యాచ్‌లు ఆడిన సమయంలో బేడీ సర్ కోచ్‌గా ఉన్నారు. అప్పట్లో ఆయన శిక్షణ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు అనిపించేది. అతనిచ్చిన విలువైన సలహాలు, సూచనలు నా క్రికెట్ జీవితంలో భాగమయ్యాయి. ఇప్పుడు అదే నా జీవితంలో భాగంగా మారిపోయింది. ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించిన కెప్లెన్లతో కలిసి వేదిక పంచుకోవడం గర్వంగా భావిస్తున్నా' అని కోహ్లీ తెలిపాడు.

కోహ్లీ చేష్టలతో నేను ఏకీభవించను
అనంతరం కోహ్లీ గురించి బిషన్ సింగ్ బేడీ మాట్లాడుతూ 'మైదానంలో కోహ్లీ చేష్టలతో నేను ఏకీభవించను. కానీ అతనంతా దూకుడైన భారత క్రికెటర్‌ను ఇప్పటి వరకు చూడలేదు. రాబోయే రోజుల్లో అతనిలోని ఆ కోణం మెత్తబడొచ్చు, కానీ విరాట్‌ను చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. రంజీ, దులీప్ టోర్నీలను యువ క్రికెటర్లు ఐపీఎల్ ప్లాట్‌ఫామ్‌గా మలుచుకుంటున్నారు. రెడ్, గ్రీన్, బ్లూ జట్లకు ఇలాంటి పేర్లు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదు' అని తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

అంజుమ్ చోప్రా పేరిట ఫిరోజ్‌షా కోట్లాలో గేట్
భారత మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా పేరు మీద ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో గేట్‌ను బుధవారం ఆవిష్కరించారు. తన పేరిట ఏర్పాటు చేసిన గేట్ ముందు చోప్రా ఫొటోలకు పోజిచ్చింది. ఢిల్లీ క్రికెట్‌కు సేవలకు గుర్తింపుగా డీడీసీఏ అంజుమ్ చోప్రాకు ఈ గౌరవాన్ని కల్పించింది. మరోవైపు కొత్తగా నిర్మించిన స్టాండ్స్‌కు ఢిల్లీ దిగ్గజ ఆటగాళ్లు బిషన్ సింగ్ బేడీ, మొహిందర్ అమర్‌నాథ్‌ల పేర్లను పెట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications