ఆర్జనలో 3: ఫేమ్‌లో సల్మాన్, షారుక్‌లను మించిన కోహ్లీ
హైదరాబాద్: ఫోర్బ్స్ ఇండియా ఈ ఏడాది ప్రకటించిన 100 మంది సెలబ్రిటీల జాబితాలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది అత్యధిక సంపాదన, పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన భారతీయ ప్రముఖుల్లో విరాట్ కోహ్లీకి మూడో స్థానం దక్కింది.
క్రికెటర్ల పరంగా చూస్తే విరాట్ కోహ్లీ మొట్టమొదటిస్ధానంలో ఉన్నాడు. ఇక మొదటి రెండు స్ధానాల్లో బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లు ఉన్నారు. గతేడాది ఏడో స్ధానంలో నిలిచిన కోహ్లీ ఈ ఏడాది రూ.134.44 కోట్ల ఆదాయంతో మూడో స్థానానికి ఎగబాకాడు.

మూడో స్ధానంలో నిలిచిన విరాట్ కోహ్లీ
ఇక టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (రూ. 122.48 కోట్లు) ఐదో స్ధానంలో నిలవగా, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (రూ. 58 కోట్లు) ఆరో స్ధానాన్ని దక్కించుకున్నాడు. ఇక సంపాదన, పేరు ప్రఖ్యాతుల్లో కలిపి మూడో స్ధానంలో నిలిచిన విరాట్ కోహ్లీ, పేరు ప్రఖ్యాతుల వరకే చూస్తే సల్మాన్, షారుఖ్‌లను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్ధానంలో నిలిచాడు.

షారుక్‌ను అధిగమించిన సల్మాన్ ఖాన్
ఇటీవలే బాలీవుడ్ నటి, మోడల్ హాజెల్ కీచ్‌ను వివాహం చేసుకున్న టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ 13వ స్ధానంలో నిలవగా, టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 17వ స్ధానంలో నిలిచాడు. ఇక ఆర్జన విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా సల్మాన్ ఖాన్ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌ను అధిగమించడం విశేషం.

ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటే కోహ్లీకి ట్విట్టర్‌లో 13.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు ఈ ఏడాది ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

12 టెస్టుల్లో 75.93 సగటుతో 1215 పరుగులు
ఇక ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు సిరిస్‌లో కోహ్లీ 655 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని సైతం గెలుచుకున్నాడు. ఇక మొత్తంగా చూస్తే ఈ ఏడాది కోహ్లీ 12 టెస్టుల్లో 75.93 సగటుతో 1215 పరుగులు చేశాడు. అందులో మూడు డబుల్ సెంచరీలున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications