For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐర్లాండ్‌తో రెండో టీ20లో ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 2 పరుగులు ఎందుకు కట్ అయ్యాయంటే ?

 Why Two Runs Deducted in India First Innings in 2nd T20 against Ireland

జూన్ 28న డబ్లిన్‌లోని ది విలేజ్‌లో ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఇండియా ఉత్కంఠకరమైన రీతిలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో భారత్ టీ20 సిరీస్‌ను 2-0తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రెండో టీ20లో హుడా సెంచరీ సాధించగా.. సంజూ శాంసన్ కూడా 77పరుగులతో రాణించాడు. దీంతో నిర్ణీత 20ఓవర్లలో భారత్ 225పరుగులు స్కోరు చేయగలిగింది. భారత ఇన్నింగ్స్ స్కోరు వేయడంలో ఒక మిస్టేక్ జరిగింది. భారత్ ఇన్నింగ్స్ పూర్తయ్యే సరికి 227పరుగులు చేసినట్లు తొలుత స్కోరుబోర్డు మీద కన్పించింది. దీంతో టార్గెట్ 228గా ఫిక్సయింది. అయితే బ్రేక్ టైంలో స్కోరు మాస్టర్స్ తమ తప్పును తెలుసుకున్నారు. ఇక భారత స్కోరును 225గా మార్చి ఐర్లాండ్ లక్ష్యాన్ని 228 నుండి 226కి సవరించారు.
ఇంతకీ అసలేం జరిగిందంటే.. 20వ ఓవర్ తొలి బంతికి కెప్టెన్ పాండ్యా స్ట్రైకింగ్లో ఉన్నాడు. అతను లాంగ్-ఆఫ్ దిశగా ఫుల్ టాస్‌ బంతిని ఆడాడు. లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ పరిగెత్తుకుంటూ వెళ్లి బంతిని ఆపాడు. ఇక అవతలి ఎండ్‌లో ఉన్న హర్షల్ పటేల్, పాండ్యా కలిసి 2రన్స్ తీశారేమో అని స్కోరు బోర్డు మాస్టర్లు అనుకున్నారు. దీంతో వాళ్లు స్కోరుకు రెండు పరుగులు జోడించారు. అయితే ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వాళ్లు తమ తప్పును తెలుసుకున్నారు. తొలి బంతికి హార్దిక్ పాండ్యా 2రన్స్ తీయలేదని, తానే స్ట్రైకింగ్ ఉంచుకున్నాడని తేలింది. ఈ విషయాన్ని మ్యాచ్ రిప్లేలో వాళ్లు చూసి గ్రహించారు. వెంటనే స్కోరును 227 నుండి 225కి సవరించారు.
ఇకపోతే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆదిలోనే ఇషాన్ కిషన్‌ ఔటయ్యాడు. కానీ క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా, ఓపెనర్ శాంసన్ అద్భుతంగా ఆడారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 176పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో భారత్ 200పరుగుల మార్కును సులభంగా దాటింది. ఇక ఛేదనలో ఐర్లాండ్ బ్యాటర్లు కూడా భలే తెగువ చూపారు. కెప్టెన్ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్ పవర్ ప్లేలో ఎడాపెడా సిక్సులు బాదారు. అయితే ఐర్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం, చివర్లో ఉమ్రాన్ మాలిక్ 17పరుగులను విజయవంతంగా డిఫెండ్ చేయడంతో భారత్ గెలుపొందింది. రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుతమైన బ్యాటింగ్ చేసిన హుడా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

Story first published: Thursday, June 30, 2022, 10:28 [IST]
Other articles published on Jun 30, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+