
సూర్య టెక్నిక్ పనికిరాదు!
క్రికెట్ అంటే బంతి, బ్యాటు మాత్రమే కాదు. మరెన్నో అంశాలు దీనిలో ఇమిడి ఉంటాయి. టెస్టుల్లో బ్యాటర్‌కు మంచి డిఫెన్స్, టెక్నిక్ ప్రధానం. వన్డేల్లో ఇన్నింగ్స్ నిర్మించడం, పరిస్థితికి తగ్గట్లు వేగం పెంచడం ముఖ్యం. ఇక టీ20ల్లో అయితే క్రీజులోకి వచ్చినప్పటి నుంచే భారీ షాట్లు ఆడాలి. సూర్య ఈ మూడో విషయాన్ని బాగా వంట బట్టించుకున్నాడు. దానికితోడు కొంత కాలంగా మరీ ఎక్కువగా టీ20లు ఆడటంతో వన్డేలకు తగినట్లు తన ఆటను మార్చుకోలేక పోతున్నాడు. దీంతో అతని టెక్నిక్ వన్డేలకు, టెస్టులకు పనికొచ్చేలా కనిపించడం లేదు. మరి భవిష్యత్తులో అయినా ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి.

టీం మేనేజ్‌మెంట్ తప్పు ఇది..!
వన్డే అరంగేట్రం చేసినప్పటి నుంచి సూర్యకు ఒక స్థానం కన్ఫర్మ్ కాలేదు. అందరూ సంజూ, జేసన్ హోల్డర్‌లా ఫ్లోటర్ బాధ్యతలు నిర్వర్తించలేరు కదా. అంటే తను ఆడే స్థానం మారుతున్నా రాణించే సత్తా అందరి వద్ద ఉండదు. ముఖ్యంగా కొత్తగా ఆడుతున్న వారిని ఒక స్థానంలో అట్టిపెడితే దానికి వాళ్లు అలవాటు పడతారు. కానీ సూర్య విషయంలో టీం మేనేజ్‌మెంట్ అలా చేయలేదు. వన్డేల్లో మూడు నుంచి ఆరు వరకు అతని స్థానాన్ని మారుస్తూనే వచ్చింది. వీటిలో ఐదో స్థానంలో 11 ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్య రాణించాడు. కానీ ఇప్పుడు ఆ స్థానంలో రాహుల్ ఉండటంతో అతన్ని నాలుగులోకి ప్రమోట్ చేసింది టీం మేనేజ్‌మెంట్. ఇలా ఒక నిలకడలేకపోవడం కూడా అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపిస్తుండొచ్చు.

టీ20లు ఆడితే.. వన్డేలో ఛాన్స్?
పొట్టి ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ సూపర్ బ్యాటరే. ఈ విషయం ఎవరూ కాదనరు. కానీ అతని వన్డే గణాంకాలు ఏంటి? దేశవాళీల్లో కూడా అతను లిస్ట్-ఎ మ్యాచుల్లో పెద్దగా రాణించలేదు. తన కెరీర్‌లో 123 లిస్ట్-ఎ మ్యాచులు ఆడిన సూర్య కేవలం మూడు సెంచరీలు మాత్రమే చేశాడు. అతని సగటు కూడా 35 కన్నా తక్కువే. ఈ లెక్కన చూసుకుంటే కేవలం టీ20ల్లో రాణిస్తున్నాడనే కారణంతోనే అతన్ని వన్డే జట్టులోకి తీసుకున్నట్లు తెలిసిపోతుంది. నిజంగా సూర్యను వన్డే బ్యాటర్‌గా మార్చాలంటే అతన్ని దేశవాళీల్లో ఎక్కువ వన్డేలు ఆడించాలి కదా. కానీ బీసీసీఐ అలా చెయ్యలేదు. వన్డేల్లో సూర్య ఫెయిల్ అవడానికి ఇది కూడా ఒక కారణమే.


Click it and Unblock the Notifications












