పంత్ విషయంలో ఎందుకంత పంతం
ఇకపోతే బ్యాటింగ్ విభాగంలో ప్రధానంగా కొన్ని క్వశ్చన్లు చాలా మందిలో కలుగుతున్నాయి. పంత్ విషయంలో బీసీసీఐ మొండి వైఖరి ఏంటో సగటు అభిమానికి అర్థం కాలేదు. పంత్ ఎన్నిసార్లు నిరాశపర్చుతున్నా అతన్ని వెనకేసుకుని వస్తున్నారే తప్పా తొలగించే సాహసం చేయడం లేదు. పంత్ స్థానంలో భారత అమ్ములపొదిలో నిఖార్సైన సంజూ శాంసన్ ఉన్నాడనే విషయాన్ని సెలెక్షన్ కమిటీ ఎందుకు మర్చిపోతుందో అర్థం కావట్లేదు. పోనీ లెఫ్టాండర్‌నే తీసుకోవాలనుకున్నా.. ఇషాన్ కిషన్ ఉన్నాడుగా..! ఇషాన్ కూడా కీపరే కదా.. మరీ ఎందుకో పంత్ విషయంలో సెలెక్షన్ కమిటీ పంతం అసలు వీడట్లేదు.
అవసరమైన టైంలో రాహుల్ ఆడతాడా?
ఇకపోతే కేఎల్ రాహుల్ గురించి కూడా కమిటీ కాస్త ఆలోచించాల్సిందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకునేలా అవసరమైన టైంలో చేతులేత్తేసి అనవసర టైంలో రెచ్చిపోయే కేఎల్ రాహుల్ జట్టులో ఎందుకు.. అంటూ నెటిజన్లు కారాలు మిరియాలు నూరుతూ ట్రోల్స్ చేస్తున్నారు.
ఇంకొందరు కేఎల్ రాహుల్‌కు జట్టులో చోటివ్వడమే ఎక్కువ అనుకుంటే వైస్ కెప్టెన్సీ హోదా కూడానూ అంటూ దెప్పిపొడుస్తున్నారు. గాయం కారణంగా కొన్నాళ్లపాటు జాతీయ జట్టుకు దూరమైన రాహుల్ ఇటీవలే మళ్లీ జట్టులోకి వచ్చాడు. ప్రధాన జట్లపై రాహుల్ ప్రదర్శన చాలా పేలవంగా ఉండడం అతని బిగ్ మైనస్.. అతని స్థానంలోనైనా సంజూకు చోటు దక్కితే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం. రాహుల్ స్థానంలో హార్దిక్‌ను వైస్ కెప్టెన్ చేస్తే కాస్త ఉపయోగముంటుందన్నట్లు కూడా కొందరు అంటున్నారు.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్(కీపర్), దినేశ్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్యా, అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్
స్టాండ్ బై ప్లేయర్స్: మహమ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్


Click it and Unblock the Notifications












