అందుకే ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్‌లను ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక చేయలేదు : వెస్టిండీస్ చీఫ్ సెలెక్టర్ హేన్స్

వెస్టిండీస్ స్టార్లు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ టీ20 ఫార్మాట్‌లో ఇద్దరు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు అనే సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా టీ20 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టులో వీరిద్దరికి చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ అక్టోబర్ - నవంబర్ మధ్య జరుగుతుందనే సంగతి తెలిసిందే. ఇక వెస్టిండీస్ బోర్డు ఎంపిక చేసిన జట్టులో నికోలస్ పూరన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
ఇక రస్సెల్, నరైన్‌లను జట్టు మేనేజ్ మెంట్ తప్పించడానికి నిర్దిష్ట కారణాలు వెల్లడించనుకున్నా కొన్ని అసలు కారణాలు ఉన్నాయి. ఇకపోతే జట్టు ఎంపికలో కొంత ఆశ్చర్యకరమైన పేర్లు కూడా కన్పించాయి. లెగ్ స్పిన్నర్ హేడెన్ వాల్ష్, రొమారియో షెఫార్డ్‌లు జట్టుకు ఎంపిక కాలేదు. గత కొంతకాలంగా జట్టు తరఫున వీరిద్దరు రెగ్యులర్ ప్లేయర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరి స్థానాల్లో 30ఏళ్ల మణికట్టు స్పిన్నర్ యానిక్ కారియా, లెఫ్ట్ ఆర్మ్ సీమ్-బౌలింగ్ ఆల్‌రౌండర్ రేమన్ రైఫర్ ఎంపికయ్యారు.
కొందరికి మోదం.. కొందరికి ఖేదం
ఇకపోతే వికెట్ కీపర్ కం బ్యాటర్ అయిన జాన్సన్ చార్లెస్.. సీపీఎల్ 2022లో రాణించడంతో అతను తిరిగి జట్టులోకి ఎంపికయ్యాడు. చివరిగా డిసెంబర్ 2016లో అతను వెస్టిండీస్ తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. గత కొన్ని నెలలుగా ఫిట్ నెస్ సమస్యలతో బాధపడుతున్న ఎవిన్ లూయిస్ మళ్లీ జట్టు తలుపు తట్టాడు. ఇక టాప్-ఆర్డర్‌లో బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్ లాంటి హిట్టర్లు కూడా జట్టుకు ఎంపికవ్వడంతో టాపార్డర్ బలంగా కన్పిస్తుంది. జట్టులో కేవలం ఒక ఎడమచేతి వాటం స్పిన్నర్‌కు మాత్రమే చోటు ఉండటంతో.. ఫాబియన్ అలెన్‌ను తప్పించి అకేల్ హోసేన్‌ను తీసుకున్నారు.
రస్సెల్‌ను ఎంపిక చేయకపోవడానికి గత వివాదాలు కారణం కాదు..
సీపీఎల్ 2022లో ఇప్పటివరకు కేవలం 8.50 సగటుతో 4ఇన్నింగ్స్‌లలో కేవలం 34పరుగులు మాత్రమే ఆండ్రీ రస్సెల్ చేయగలిగాడు. దీంతో ఆండ్రీ రస్సెల్ ఫామ్ కోల్పోయాడని భావించి జట్టుకు ఎంపిక చేయలదేని బోర్డు పేర్కొంది. అయితే గతంలో రస్సెల్, వెస్టిండీస్ బోర్డు, కోచ్‌కు మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. రస్సెల్ ఫ్రాంచైజీ క్రికెట్ ధ్యాసలో పడి.. జాతీయ జట్టు సెలెక్షన్‌కు అందుబాటులో ఉండడం లేదంటూ అప్పట్లో బోర్డు, కోచ్ అతని మీద సీరియస్ అయ్యారు. దానికి అతను కూడా ఘాటుగా రిప్లే ఇస్తూ.. మీ వల్లే ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుకోవాల్సిన దుస్థితి వచ్చిందని తెలుసుకోండి అంటూ బదులిచ్చాడు. అయితే వెస్టిండీస్ చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ మాట్లాడుతూ.. గత వివాదాల వల్ల అతన్ని ఎంపిక చేస్తాలేము అనుకోకండి. మేం ఈ సంవత్సరం ప్రారంభంలో ఆండ్రీ రస్సెల్‌తో మాట్లాడాం. అన్ని వివాదాలు ముగిశాయి. అయితే అతను ఇటీవల అంత బాగా రాణించట్లేదు. అందువల్ల అతని కంటే మంచి ఫాంలో ఉన్నవాళ్లను తీసుకోవాలనుకున్నాం' అని హేన్స్ చెప్పాడు.

గతేడాది ప్రపంచకప్ లాగే ఈసారి కూడా నరైన్
ఇకపోతే వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్‌తో తన సమస్యలను ఇంకా పరిష్కరించుకోలేకపోయిన నరైన్‌కు ఉద్వాసన తప్పదని ముందుగానే అందరూ ఊహించారు. నరైన్ కీలక పర్యటనలకు జట్టు సెలెక్షన్‌కు మిస్ అవుతూ ఫ్యామిలీ టైం అంటూ పేర్కొనడం, అలాగే రెమ్యూనరేషన్, కాంట్రాక్టు తదితర కారణాలు కూడా నరైన్‌ను జట్టుకు దూరం చేశాయి. ఈసారి కూడా 2021ప్రపంచకప్ మాదిరిగానే తాను సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాననే విషయాన్ని మాకైతే చెప్పలేదు అంటూ హేన్స్ పేర్కొన్నాడు. కెప్టెన్ నికోలస్ పూరన్ మాత్రం నరైన్‌ను జట్టులో ఉంచాలని కోరాడని కానీ అతని నుంచి మాకెలాంటి జవాబు రాలేదు. అతను ఆడాలని కోరుకుంటున్నట్లు నాకైతే తెలియదు' అని హేన్స్ చెప్పాడు.

టీ20 వరల్డ్‌కప్ కోసం ఎంపికైన వెస్టిండీస్ టీం
నికోలస్ పూరన్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), యానిక్ కారియా, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, షిమ్రాన్ హేట్మయర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెక్‌కాయ్, రేమాన్ రీఫర్, ఓడియన్ రీఫర్,
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications