క్రిస్ గేల్‌పై వేటు ఎందుకంటే: ఆల్ రౌండర్ బిన్నీ వివరణ
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓటమిపాలైనప్పటికీ... ఏబీ డివిలియర్స్ తుది జట్టులోకి రావడంతో ఆ జట్టులో కొండంత ఉత్సాహాన్ని నింపింది.
సోమవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ 49 బంతుల్లో 89 పరుగులు చేసి బెంగళూరుకు గౌరవప్రదమైన స్కోరుని అందించాడు. అయితే తుది జట్టులోకి డివిలియర్స్ రావడంతో టీ20 విధ్వంసకర బ్యాట్స్ మెన్‌గా పేరుగాంచింన క్రిస్ గేల్‌పై వేటు పడింది.
ప్రస్తుతం డివిలియర్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో బెంగళూరు తుది జట్టులో గేల్‌కు చోటు లభించలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తన కెరీర్‌లో 25 పరుగులు చేస్తే టీ20లలో 10000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా గేల్ రికార్డు సృష్టించనున్నాడు.
ఇలాంటి సమయంలో క్రిస్ గేల్‌ను తుది జట్టులో నుంచి తప్పించడం అభిమానులకు నచ్చలేదు. మరోవైపు బెంగళూరు ప్రాంఛైజీ కూడా ఇప్పట్లో అతన్ని తుది జట్టులోకి తీసుకొచ్చే పరిస్థితి లేదని పేర్కొనడం విశేషం.

షేన్ వాట్సన్ తన కెరీర్ మొత్తం టాప్ ఆర్డర్‌లోనే ఆడాడు
‘షేన్ వాట్సన్ తన కెరీర్ మొత్తం టాప్ ఆర్డర్‌లోనే ఆడాడు. ఇప్పుడు అతని బ్యాటింగ్ స్ధానాన్ని మార్చే ప్రసక్తే లేదు. కాబట్టి డివిలియర్స్‌ను జట్టులోకి తీసుకోవాలంటే గేల్‌ను తప్పించడం తప్ప మరో మార్గం లేదు. ఇది వ్యూహాత్మక నిర్ణయం కాదు. కానీ మాకు వేరే చాయిస్ లేకే ఇలా చేస్తున్నాం. డివిలియర్స్ ఫిట్‌గా ఉన్నంతకాలం అతను తుది జట్టులో కొనసాగుతాడు' అని ఆర్సీబీ ఆల్ రౌండర్ స్టువార్ట్ బిన్నీ స్పష్టం చేశారు.

వెన్ను నొప్పి నుంచి కోలుకున్న డివిలియర్స్
వెన్ను నొప్పి నుంచి కోలుకున్న డివిలియర్స్, షేన్ వాట్సన్ తో పాటు మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు తైమాల్ మిల్స్, బిల్లీ స్టాన్లకే సోమవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో చోటు కల్పించామని అతడు పేర్కొన్నాడు. మిల్స్, బిల్లీ ఇద్దరూ ఫాస్ట్ బౌలర్లే కావడం విశేషం.

మరిన్ని పరుగులు చేయాల్సి ఉంది
తొలుత బ్యాటింగ్ చేసిన తమ జట్టు మరిన్ని పరుగులు చేయాల్సి ఉందని బిన్నీ అభిప్రాయపడ్డాడు. 148 పరుగులు పెద్ద స్కోరు కాదని, టీ20లో మంచి శుభారంభం అవసరమని చెప్పుకొచ్చాడు. మొదటి నాలుగు ఓవర్లలో రెండు వికెట్ల కోల్పోవడమే జట్టుని కష్టాల్లోకి నెట్టిందని తెలిపాడు.

తర్వాతి మ్యాచ్‌లో గ్రిస్ గేల్
మరోవైపు భుజం నొప్పి గాయం నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ మొదటి వారం మ్యాచ్‌లకు దూరం కావడంతో ఇప్పటివరకు బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లలో ఒకరిని తప్పించి రానున్న మ్యాచ్‌కు జట్టులోకి గేల్‌ను తీసుకొనే అవకాశముందని భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications