Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రీడాస్ఫూర్తి: అశ్విన్... సచిన్‌ని చూసి నేర్చుకో, బట్లర్‌ ఇది రెండోసారి (వీడియో)

Why Ravichandran Ashwin is Facing Criticism For Mankading Jos Buttler in IPL Match

హైదరాబాద్: జైపూర్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని 'మన్కడింగ్‌ ' ఔట్ రూపంలో పంజాబ్ కెప్టెన్ అశ్విన్ పెవిలియన్‌కు చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో అశ్విన్ అనైతికంగా ప్రవర్తించాడంటూ క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. క్రీడాస్ఫూర్తిని మరిచి అశ్విన్ ప్రవర్తించాడని సోషల్ మీడియాలో తెగ ఏకిపారేస్తున్నారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఇందులో భాగంగా గతంలో 'మాన్కడింగ్' సందర్భాలను గుర్తు చేస్తూ అశ్విన్‌కి చురకలు అంటిస్తున్నారు. క్రికెట్‌ నియమావళి 41.16 ప్రకారం నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ క్రీజు వదిలి ముందుకు వెళితే.. ఆ సమయంలో అతడిని బౌలర్‌ రనౌట్‌ చేసే విధానాన్ని మన్కడింగ్‌ అంటారు. మన్కడింగ్ రనౌట్ చేసే ముందు కనీసం ఒక్కసారైనా బ్యాట్స్‌మెన్‌ని బౌలర్ హెచ్చరించాలి.

జోస్ బట్లర్‌ను హెచ్చరించకుండానే

జోస్ బట్లర్‌ను హెచ్చరించకుండానే

అయితే, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ను హెచ్చరించకుండానే అశ్విన్ అతడిని రనౌట్ చేశాడు. ఇది క్రీడాస్పూర్తి విరుద్దమని, ఈ నిబంధనను తొలిగించాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది. శ్రీలంకతో 2012లో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో అశ్విన్ ఇలానే తిరుమాణెని ‘మాన్కడింగ్' రనౌట్ చేశాడు.

సెహ్వాగ్‌తో మాట్లాడిన సచిన్ టెండూల్కర్‌ క్రీడాస్ఫూర్తిని గౌరవిస్తూ

అయితే, ఆ మ్యాచ్‌కి కెప్టెన్‌గా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్‌తో మాట్లాడిన సచిన్ టెండూల్కర్‌ క్రీడాస్ఫూర్తిని గౌరవిస్తూ ‘ఔట్ అప్పీల్'ని వెనక్కి తీసుకోవాలని సూచించాడు. దీంతో సెహ్వాగ్ ఆ అప్పీల్‌ని వెనక్కి తీసుకోగా తిరుమాణె మళ్లీ తిరిగి బ్యాటింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జోస్ బట్లర్ మన్కడింగ్ ద్వారా పెవిలియన్‌కు చేరడం ఇది రెండోసారి

మరోవైపు ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్ మన్కడింగ్ ద్వారా పెవిలియన్‌కు చేరడం ఇది రెండోసారి కావడం విశేషం. 2016లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ పదే పదే క్రీజు వెలుపలికి వెళ్తుండటాన్ని గమనించిన శ్రీలంక స్పిన్నర్ తొలుత హెచ్చరించి.. ఆ తర్వాత రెండోసారి మన్కడింగ్ రనౌట్ చేశాడు. ఐపీఎల్‌ మ్యాచ్‌లో బట్లర్‌ని హెచ్చరించకుండానే అశ్విన్ రనౌట్ చేసి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

Story first published: Tuesday, March 26, 2019, 19:18 [IST]
Other articles published on Mar 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+