INDvsBAN: శాంసన్, కిషన్ ఉండగా రాహుల్ కీపింగ్?.. టీమిండియా నిర్ణయాలకు అంతా షాక్..!

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యంత చెత్తగా ఆడుతూ విమర్శల పాలవుతున్న రిషభ్ పంత్ అనూహ్యంగా బంగ్లా వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. టాస్ సందర్భంగా పంత్ గాయం కారణంగా ఈ సిరీస్‌లో ఆడటం లేదని రోహిత్ శర్మ వెల్లడించాడు. అయితే అది నిజమైన గాయమేనా..? లేక అబద్ధాలు చెప్పి పంత్‌ను పక్కన పెట్టారా? అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, టీమిండియా ఈ మ్యాచ్‌లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మరికొన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది.

నో శాంసన్..?
న్యూజిల్యాండ్ పర్యటనలో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే అవకాశం ఇచ్చిన సంజూ శాంసన్‌కు ఈ టోర్నీలో అవకాశం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అతన్ని బంగ్లా పర్యటనకు ఎంపిక చేయలేదు. ఈ నిర్ణయం చాలా మందికి షాకిచ్చింది. చివరకు పంత్ ఈ సిరీస్‌కు దూరమైతే రిప్లేస్‌మెంట్‌గా కూడా సంజూకు ఛాన్స్ ఇవ్వకపోవడం ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ ఏడాది వన్డేలు, టీ20ల్లో నిలకడగా రాణిస్తూ ఆకట్టుకున్న సంజూకు టీమిండియాలో ఆశించినన్ని అవకాశాలు రాలేదని మండి పడుతున్నారు.

రాహుల్‌కు కీపింగ్..!
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ కూడా చేస్తాడని అందరికీ తెలుసు. కానీ అతను ఈ బాధ్యతలు చేపట్టి చాలా రోజులు గడిచిపోయాయి. పంత్ వచ్చిన తర్వాత రాహుల్‌కు కీపింగ్ చేసే అవసరం రాలేదు. ఐపీఎల్‌లో కూడా అతను కీపింగ్ చేయడం లేదు. అలాంటిది బంగ్లాతో తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా రాహుల్‌కు ఈ బాధ్యతలు అప్పగించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

ఇషాన్ ఎందుకు?
పంత్ ఈ సిరీస్‌కు దూరమైతే అతని స్థానంలో స్క్వాడ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌కు జట్టులో చోటు దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అతన్ని టీం మేనేజ్‌మెంట్ పక్కన పెట్టేసింది. కీపింగ్ బాధ్యతలను రాహుల్‌కు అప్పగించింది. ఈ నిర్ణయం కూడా అందరికీ షాకిచ్చింది. దీనిపై ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే కూడా స్పందించాడు. ''రిషభ్ పంత్ లేడు. అదే సమయంలో సంజూ శాంసన్ ఇండియాలో ఉన్నాడు. ఇషాన్ కిషన్ అక్కడే ఉన్నాడు కూడా. ఇలా కీపర్లు అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే ఇప్పుడు కేఎల్ రాహుల్ కీపింగ్ చేస్తున్నాడు. నాకు ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్‌గా ఉంది' అని ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications