Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

న‌డిరోడ్డుపై హ్యాండ్ ఇచ్చిన బీఎండబ్ల్యూ: క్యాబ్‌లో వెళ్లిన గంగూలీ

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మంగ‌ళ‌వారం బీసీసీఐ టెక్నికల్ సమావేశానికి ఓ సాదాసీదా పసుపు రంగు అంబాసిడ‌ర్ కార్‌లో రావ‌డం చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ సమావేశం కోల్‌కతాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జరుగుతుండటం విశేషం.

అభిమానులు ముద్దుగా ప్రిన్స్‌ ఆఫ్‌ కోల్‌కతా అని పిలుచుకునే సౌరవ్ గంగూలీ సాదాసీదా కారులో హోటల్ ముందు దిగడంతో అంతా నోరెళ్లబెట్టారు. అస‌లు విష‌యం ఏంట‌ని ఆరా తీస్తే.. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు తన లగ్జరీ బీఎమ్‌డబ్ల్యూలో వెళ్తుండగా లీ రోడ్డులోని ఎక్సైడ్ క్రాసింగ్ కూడలి వద్ద కారులో సమస్య తలెత్తింది.

దీంతో దాదా వెంటనే క్యాబ్‌ని ఆశ్రయించాడు. కోల్‌కతాలో మంగళవారం బీసీసీఐ టెక్నికల్ కమిటీ సమావేశమైంది. ఈ కమిటీకి గంగూలీ అధ్యక్షుడు. సమావేశానికి హాజరయ్యేందుకు గంగూలీ తన ఇంటి నుంచి బీఎమ్‌డబ్ల్యూ కారులో బయలుదేరాడు. మధ్యలో కారు బ్రేక్ డౌన్ అయింది.

Why ‘Prince’ Sourav Ganguly had to take a taxi ride to cricket board meeting

దీంతో బోర్డు మీటింగ్‌కు ఆల‌స్యం కాకూడ‌ద‌న్న ఉద్దేశంతో అప్ప‌టిక‌ప్పుడు ఓ క్యాబ్‌లో సమావేశానికి అరగంట ఆలస్యంగా హాజరయ్యాడు. ఈ విష‌యాన్ని అత‌ని కార్ డ్రైవ‌ర్ వెల్ల‌డించారు. 'మార్గమధ్యలో కారులో సమస్య తలెత్తింది. కమిటీ సభ్యులతో సమావేశం చాలా ముఖ్యమైనది. దీంతో వెంటనే క్యాబ్‌ సర్వీసును ఆశ్రయించాను' అని తెలిపాడు.

క్రికెట్ అసోసియేష‌న్ ఆఫ్ బెంగాల్ అధ్య‌క్షుడి హోదాలో బీసీసీఐ టెక్నిక‌ల్ క‌మిటీ మీటింగ్‌కు అధ్య‌క్ష‌త వ‌హించాడు. ఈ ఏడాది జులైలో బలూర్‌ఘట్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి గంగూలీ మామూలు ప్రయాణికుడిలా రైల్లో వెళ్లిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+