CWC 2023:మైదానంలో ప్రార్థనలేంటీ:రిజ్వాన్ పై మాజీ క్రికెటర్ సీరియస్
ప్రపంచ కప్ మెగా టోర్నీలో భాగంగా ఇటీవల పాకిస్థాన్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీలు చేసి పాక్‌కు విజయాన్ని అందించాడు వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్. అయితే సెంచరీ తర్వాత అతడు మైదానంలో నమాజ్ చేయడం చాలా వివాదాలకు దారి తీసింది. ఈ చర్యపై తాజాగా, పాక్ మాజీ క్రికెటర్ కనేరియా రిజ్వాన్‌పై సీరియస్ అయ్యారు. పాక్ ఆటగాళ్ళు తమ మతపరమైన ప్రార్థనలు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం చేయాలని, మైదానంలోకి తీసుకురావద్దని ఈ సందర్భంగా కనేరియా సూచించారు.
మాకు దైవభక్తి ఉంది..:''క్రికెట్ లో జాతి, మతం అనే విబేధాలుండవు. కేవలం ప్రతిభ మాత్రం ఉంటే చాలు. కానీ పాక్ క్రికెటర్లు అలా కాదు. ఇతర దేశాల ఆటగాళ్ళు, ప్రేక్షకుల ముందే మతపరమైన ప్రార్థనలు చేస్తుంటారు. అయినా, మైదానంలో ప్రార్థనలేంటి, అంతగా కావాలంటే డ్రెస్సింగ్ రూమ్‌లో చేసుకోవచ్చు కదా. మాకు కూడా చాలా దైవభక్తి వుంది. అలాగని మేము మైదానంలో మంగళహారతులు చేయడం లేదు కదా. భారత ఆటగాళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మైదానంలో ఎప్పుడూ ప్రార్థనలు చేయలేదే. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లు మీలా ఎప్పుడూ నమాజ్ చేయలేదే'' అంటూ పాక్ ఆటగాళ్లపై కనేరియా సీరియస్ అయ్యారు.

తోటి ఆటగాళ్ల తీరుతో తాను ఎంతో వేదనను అనుభవించానని ఈ సందర్భంగా కనేరియా తెలిపారు. ముఖ్యంగా మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ తనతో తరచూ మతపరమైన విషయాల గురించి మాట్లాడేవారని అన్నాడు. అఫ్రిది అయితే మతం మారాలంటూ తీవ్రమైన ఒత్తిడి చేసేవాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఒక్క ఇంజమామ్ తప్పితే మిగతా పాక్ ఆటగాళ్లంతా తనను ఇబ్బందిపెట్టారని అన్నాడు. చివరకు తనతో కలిసి తినడానికి కూడా వారు ఇష్టపడేవారు కాదన్నాడు. ఇలా పాకిస్తాన్ కోసం ఆడుతున్న సమయంలో తోటి ఆటగాళ్లతోనే అనేక అవమానాలు, వేదింపులు ఎదురయ్యాయని మాజీ క్రికెటర్ డానిశ్ కనేరియా వెల్లడించాడు.
మతతత్వం కలిగిన వ్యక్తులకే చోటు..:పాకిస్థాన్‌లో ప్రస్తుతం క్రికెట్ ఆటకంటే మతమే ముందుందని కనేరియా అన్నారు. ఆ తర్వాత స్థానం రాజకీయాలకు వుంటుందన్నారు. టాలెంట్, ఆటతీరు అనేవి పాక్ క్రికెట్లో కేవలం మూడో స్థానానికే పరిమితమని ఆయన అన్నారు. అందువల్లే పాకిస్థాన్ జట్టులో టాలెంటెడ్ ప్లేయర్స్ కంటే రిజ్వాన్ వంటి మతతత్వం కలిగిన వ్యక్తులకే చోటు లభిస్తోందని ఆ దేశ మాజీ క్రికెటర్ ఆరోపించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications