
ధోనిని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో నాకు అర్థం కావడంలేదు
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడాడు. 'ధోనిని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో నాకు అర్థం కావడంలేదు. ఒక బ్యాట్స్‌మెన్‌గా నేను మూడు సార్లు విఫలమైనా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే నా వయసు 35 సంవత్సరాలు కాదు కాబట్టి' అని కోహ్లీ తెలిపాడు.

ధోని ఇప్పటికీ ఫిట్‌గానే ఉన్నాడు
'ధోని ఇప్పుడు చాలా ఫిట్‌గా ఉన్నాడు. ఫిట్‌నెస్‌పై నిర్వహించిన అన్ని టెస్టుల్లో పాసవుతున్నాడు. మైదానంలో జట్టు కష్టసమయంలో ఉన్నప్పుడు ఆదుకుంటున్నాడు. శ్రీలంక, ఆస్ట్రేలియాలతో ముగిసిన సిరీస్‌లో ధోని బ్యాట్‌తో రాణించాడు' అని ధోనికి మద్దతుగా కోహ్లీ నిలిచాడు.

పాండ్యా కూడా అనుకున్న స్థాయిలో రాణించలేదు
'ఈ సిరీస్‌లో అతనికి ఎక్కువ సమయం మైదానంలో ఉండి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ధోని మాత్రమే కాదు ఈ సిరీస్‌లో హార్దిక్ పాండ్యా కూడా అనుకున్న స్థాయిలో రాణించలేదు. మరి అతన్ని ఎందుకు టార్గెట్ చేయరు. ఒక్క ధోనిని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఎందుకు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు' అని కోహ్లీ అన్నాడు.

క్రీజులోకి వచ్చిన సమయానికి రన్ రేట్ 8.5-9.5
'ధోని క్రీజులోకి వచ్చిన సమయానికి రన్ రేట్ 8.5-9.5 మధ్యలో ఉంది. వికెట్ కూడా అనుకూలించలేదు. వికెట్ కూడా కొత్త బాల్‌తో బౌలింగ్ చేసినప్పటిలా లేదు. టాపార్డర్‌లో వచ్చేవాళ్లు లోయర్ ఆర్డర్‌లో వచ్చేవాళ్ల కంటే ఈజీగా బాల్‌ను బౌండరీకి తరలించగలరు. మ్యాచ్ గడుస్తున్నకొద్దీ పిచ్ మందగించడం మన కండిషన్స్‌లో సాధారణం' అని కోహ్లీ అన్నాడు.

కఠిన సమయాల్లో జట్టుకు సేవలు
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరిస్‌లో ధోని 25, 18 నాటౌట్, 25 పరుగులు చేయగా... ఇక టీ20ల్లో 7 నాటౌట్, 49, తిరువనంతపురం వన్డేలో పరుగులేమీ చేయకుండానే క్రీజులో నాటౌట్‌గా ఉన్నాడు. 'ధోని బాగానే ఆడుతున్నాడు. గేమ్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించి జట్టుకు అవసరమైనప్పుడల్లా అతడి సేవలను అందిస్తున్నాడు' అని కోహ్లీ అన్నాడు.

మిగితా ఎవరికీ హక్కు లేదు
టీమ్ మేనేజ్‌మెంట్, సభ్యుల ఆలోచన పూర్తి వేరుగా ఉంటుందని, బయట ఎవరు ఏమనుకున్నారన్నది పట్టించుకోమని కోహ్లీ స్పష్టంచేశాడు. బ్యాటింగ్‌కు వెళ్లేటప్పుడు ఎమోషనల్‌గా ఫీల్ అవడం కంటే.. వికెట్ ఎలా ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామన్నదే తాము ఆలోచిస్తామని కోహ్లి చెప్పాడు. 'ధోని చాలా బాగా ఆడుతున్నాడు. కష్టపడుతున్నాడు. అయితే అది ప్రతి మ్యాచ్‌లో కనిపించదు. అతను ఢిల్లీలో ఒక్క సిక్స్ కొడితే మ్యాచ్ తర్వాత పదిసార్లు చూపించారు. ఒక్క మ్యాచ్‌లో ఫెయిలవగానే అతని వెంట పడుతున్నాం. ధోని ఏంటో అతనికి బాగా తెలుసని, అతని గురించి అతనే నిర్ణయం తీసుకుంటాడు తప్ప మిగితా ఎవరికీ హక్కు లేదు' అని కోహ్లీ స్పష్టం చేశాడు.


Click it and Unblock the Notifications











