Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసలు కారణం ఇదీ: భారత్‌తో చేతిలో ఓటమిపై పాక్ కెప్టెన్

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలవ్వడంపై పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందించాడు. పాక్ జట్టులో చాలా మంది ఆటగాళ్లు తొలిసారి భారత్‌తో ఆడారని, దీంతో భారత్‌తో మ్యాచ్ అనగానే ఒకింత ఒత్తిడికి గురయ్యారని చెప్పాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్| ఫోటోలు | స్కోరు కార్డు

'భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఎప్పడైనా పెద్ద యుద్ధం లాంటిదే. మా జట్టులో చాలా మంది యువఆటగాళ్లు భారత్‌తో తొలిసారి మ్యాచ్‌ ఆడుతున్నారు. దీంతో యువఆటగాళ్లు ఒకింత ఒత్తిడి, ఆందోళనలో ఉన్నారు. దీంతో వారు ఒత్తిడిలో అందివచ్చిన అవకాశాలను చేజార్చారు. కీలక సమయంలో క్యాచ్‌లను వదిలేశారు. ఆ సమయంలో మేము ఫీల్డిండ్‌ సరిగ్గా చేసిఉంటే పరిస్థతి ఇంకోలా ఉండేది' అని సర్ఫరాజ్ అన్నాడు.

Why Pakistan lost to India in ICC Champions Trophy: PAK captain tells all

'వారిని అందులోనుంచి బయటకు తీసుకురావడానికి మేం చాలా ప్రయత్నించాం. వారితో ఉదయమే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆడబోయే రెండు మ్యాచ్‌లు మాకు చాలా కీలకం. మా దృష్టి అంతా ఇప్పుడు వాటిపైనే ఉంది. గ్రౌండ్‌లో అమలు చేయాల్సిన ప్రణాళికలపై అందరం చర్చించాం' అని పేర్కొన్నాడు.

భారత్ మ్యాచ్‌ అనంతరం పాక్ ఆటగాళ్లు ఒకింత నిరాశలో ఉన్న మాట నిజమేనని, అయితే ప్రస్తుతం అంతా సర్దుకుందని తెలిపాడు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం పాకిస్థాన్, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ద ఓవల్ వేదికగా జరగనుంది.

దక్షిణాఫ్రికాతో చివరిసారిగా పాకిస్థాన్ 2015 వరల్డ్ కప్‌లో తలపడింది. ఇదిలా ఉంటే భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడి మొత్తం టోర్నీకే దూరమైన వాహబ్‌ రియాజ్‌ స్థానంలో యువబౌలర్‌ రుమన్‌ రాయిస్‌ను ఎంపిక చేసినట్లు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ప్రకటించిన సంగతి తెలిసిందే.

రియాజ్‌ స్థానాన్ని ఏ బౌలర్‌తో భర్తీ చేయాలని తీవ్రంగా ఆలోచించిన పీసీబీ చివరకు రుమన్‌ రాయిస్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ యువ బౌలర్‌కు ఇప్పటివరకు ఒక్క టీ20 మాత్రమే ఆడిన అనుభవం ఉంది. తనపై నమ్మకం ఉంచి జట్టులోకి తీసుకున్నందుకు ఈ సందర్భంగా రాయిస్‌ ధన్యవాదాలు తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+