సిడ్నీ: స్పైడర్ కెమెరాలకు కూడా 2,000 డాలర్లు జరిమానా విధించాలని భారత ట్వంటీ 20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చమత్కరించారు. ఇటీవల అయిదో వన్డే సమయంలో విరాట్ కోహ్లీ ఫోర్ కొట్టాడు. అయితే, బంతి స్పైడర్ కెమెరాను తాగింది. దీంతో అది ఫోర్ వెళ్లిన అంపైర్ ఇవ్వలేదు.
దీనిపై విలేకరులు ప్రశ్నలు వేశారు. స్పైడర్ కెమెరాకు జరిమానా విధించాలా అని అడిగారు. దానిపై ధోనీ మాట్లాడుతూ... ఏదైనా తప్పు చేస్తే అందరికీ జరిమానా విధిస్తారని, అలాంటప్పుడు స్పైడర్ కెమెరాకు ఎందుకు విధించరని ధోనీ సరదాగా అన్నారు.

అంతకుముందు ధోనీ దీనిపై స్పందిస్తూ.. తాను సంప్రదాయవాదినని, ఏదైనా ఇబ్బంది కలిగిస్తే తనకు నచ్చదని వ్యాఖ్యానించాడు. అభిమానులు చూస్తున్నారని తనకు తెలుసునని, కానీ అంతకుమించి ఇక్కడ నాలుగు పరుగులు చాలా ముఖ్యమని చెప్పాడు.