For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ ఇలాగే ఆడితే చాలా కష్టమైపోతది: డుప్లెసిస్

 Why MS Dhoni is unstoppable, Chennai Super Kings teammate Faf du Plessis explains

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2018 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గత కొన్నేళ్లుగా ధోనీ బ్యాటింగ్‌లో దూకుడు తగ్గిందని, మ్యాచ్‌లను గొప్పగా ముగించడంలో విఫలమవుతున్నాడని ఇక ధోనీ పనైపోయిందని విశ్లేషకులు తమదైన శైలిలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా క్రీజులోకి వచ్చి మునుపటిలానే మ్యాచ్‌లను ఫినిష్ చేస్తున్నాడు.

ధోనీ ఫామ్‌ గురించి డుప్లెసిస్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీపై ఆ జట్టు ఆటగాడు డుప్లెసిస్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. టోర్నీలో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌, ఢిల్లీ డేర్‌‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ బౌలర్లపై విరుచుకు పడుతూ, బౌండరీలు బాదుతూ హాఫ్ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ధోనీ ఫామ్‌ గురించి డుప్లెసిస్‌ మాట్లాడాడు.

వైడ్ వేసిన బంతిని సైతం:

‘ప్రస్తుతం ధోనీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సమయం బౌలర్లకు ఎంతో కఠినమైనది. వైడ్ వేసిన బంతిని సైతం ధోనీ ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తాడు. బంతిని హిట్‌ చేసేందుకు అతని వద్ద చాలా అవకాశాలు ఉన్నాయి. ఎలా కావాలంటే అలా కొట్టగలుగుతున్నాడు. ఇది జట్టుకు కలిసొచ్చే అంశం. ధోనీ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు, కెప్టెన్లకు చాలా కష్టం' అని అన్నాడు డుప్లెసిస్‌.

తొలి బంతినే బౌండరీకి తరలించి:

‘అంబటి రాయుడు శైలి నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అతని ఆటను చూసి నేను నిజంగా ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నా. తాను ఎదుర్కొనే మొదటి బంతినే బౌండరీ తరలించి పరుగులు రాబట్టాలనుకుంటాడు. ఇలాంటి ప్రదర్శనను అందరు ఆటగాళ్లు చేయలేరు. చాలా తక్కువ మందికి ఈ ప్రతిభ ఉంటుంది. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇవ్వకపోయినా రైనా, రాయుడు.. మూడు, నాలుగు స్థానాల్లో వచ్చి సహజమైన ఆట ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నారు. ప్రత్యర్థి జట్లను ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. బ్యాటింగ్‌ యూనిట్‌లో మా జట్టు ఎంతో బలంగా ఉంది' అని సంతోషం వ్యక్తం చేశాడు డుప్లెసిస్‌.

ఆవేశ్‌ఖాన్ బౌలింగ్‌లో ధోనీ కసితో బాదిన సిక్స్:

ఢిల్లీతో మ్యాచ్‌లో ఆవేశ్‌ఖాన్ బౌలింగ్‌లో ధోనీ కసితో బాదిన సిక్స్ 108 మీటర్లు ప్రయాణించింది. టోర్నమెంట్‌లోనే ఇది రెండో అత్యధిక దూరం ప్రయాణించిన సిక్స్‌గా నిలిచింది. చెన్నై ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రెండు పరుగులు సాధించిన మహీ(51 నాటౌట్: 22 బంతుల్లో 2ఫోర్లు, 5సిక్స్‌లు) అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ధోనీకి ఇది మూడో ఆఫ్‌సెంచరీ కావడం విశేషం. 2013 తరువాత ధోనీకి ఇదే అత్యంత వేగవంతమైన అర్ధశతకం.

Story first published: Tuesday, May 1, 2018, 16:46 [IST]
Other articles published on May 1, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+