న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఏ మ్యాచ్‌లోనైనా విజయం అనంతరం స్టంప్స్ సేకరించే అలవాటున్న విషయం తెలిసిందే. అయితే ధోనీ అలా తీసుకెళ్తున్న స్టంప్స్‌ను ఏం చేస్తున్నట్టు? అనే ప్రశ్నకు సమాధానం మాత్రం ఇప్పటి వరకు తెలియదు.
కాగా, ఇటీవల ఓ మీడియా ప్రతినిధి అదే ప్రశ్నను ధోనీకి సంధించాడు. దీనికి ధోనీ ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది.
Photos: టీ20 ప్రపంచకప్ సందడి
ధోనీ ఏం చెప్పాడంటే..'మ్యాచ్ పూర్తయిన తర్వాత స్టంప్స్ కలెక్ట్ చేయడాన్నిచాలా సంవత్సరాలుగా చేస్తున్నా. ఆ స్టంప్‌ను చూసినప్పుడు అది ఫలానా మ్యాచ్‌లోనిది అని గుర్తొస్తుంది. అయితే స్టంప్స్‌పై మాత్రం ఎటువంటి మార్క్ చేయను'అని ధోనీ వివరించాడు.

అయితే నిజానికి ధోనీ స్టంప్స్ కలెక్షన్ వెనుక మరో ప్రత్యేక కూడా ఉంది. ధోనీ చిన్ననాటి పాఠశాల స్నేహితుడైన కుల్బిందర్, ఓ నేపాలీ వాచ్‌మన్ కొడుకు. ధోనీకి కుల్బిందర్ స్నేహితుడు మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువే.
ధోనీని క్రికెట్ వైపు ప్రోత్సహించింది కుల్బిందరే. కాలక్రమంలో ధోని స్టార్ క్రికెటర్‌గా ఎదిగి ప్రపంచంలోనే మేటి క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకోగా.. కుల్బిందర్ మాత్రం అంతగా రాణించలేకపోయాడు.
అనంతర కాలంలో కుల్బిందర్ ఓ ఇంటిని నిర్మించుకున్నాడు. ధోనీ ఎంతో ఎత్తుకు ఎదిగినా ఇంటి నిర్మాణానికి అతని నుంచి ఏమీ ఆశించలేదీ చిన్ననాటి ప్రాణమిత్రుడు. అయితే ఒకే ఒక్కటి మాత్రం ధోనీ నుంచి ఆశించాడు.
తాను నిర్మించుకున్న చిన్న ఇంటి చుట్టూ స్టంప్స్‌తో ప్రహరీ లాంటిది కట్టుకోవాలనుకుంటున్నానని, అందుకు 320 స్టంప్స్ కావాలని ధోనీని కోరాడట. ఇక అప్పటి నుంచి మిత్రుడి కోరిక మేరకు ధోనీ స్టంప్స్‌ను కలెక్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇదే ధోనీ స్టంప్స్ సేకరణ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ.