Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్ వన్డే సిరీస్‌లో డీఎస్పీకి దక్కని చోటు.. అసలు కారణమేంటంటే?

ఇంగ్లండ్ పర్యటనకు ప్రకటించిన భారత వన్డే జట్టు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ పేరు లేకపోవడంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. గత కొన్నేళ్లుగా వైట్ బాల్ క్రికెట్లో భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న ఈ హైదరాబాదీ పేసర్‌ను పక్కన పెట్టడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఇంగ్లండ్ లాంటి పిచ్‌లపై మహ్మద్ సిరాజ్‌కు మంచి రికార్డు ఉన్నప్పటికీ.. సెలెక్టర్లు సిరాజ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అ‌ర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్‌లకు అవకాశం ఇచ్చారు. మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి గల ప్రధాన కారణాలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. రెండు కీలకాంశాలు ఇందుకు కారణమైనట్లు తెలుస్తోంది.

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్
మహ్మద్ సిరాజ్‌ను వన్డే సిరీస్ కంటే ముందే ఐర్లాండ్, ఇంగ్లండ్‌ జట్లతో జరగాల్సిన టీ20 సిరీస్‌ల నుంచి కూడా బీసీసీఐ తప్పించింది. రాబోయే సుదీర్ఘ అంతర్జాతీయ సీజన్, కీలకమైన టెస్ట్ మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని, అతనికి తగినంత విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ మెడికల్ టీమ్, టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించాయి. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ గతంలో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలోనే మహ్మద్ సిరాజ్‌కు వన్డే సిరీస్ నుంచి కూడా పొడిగించిన విశ్రాంతిని ఇచ్చినట్లు తెలుస్తోంది.

Why Mohammed Siraj Was Left Out of India Squad of England ODI Series Key Reasons Explained Details

2023 వరల్డ్ కప్ తర్వాత ఫామ్ లేమి
మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి కేవలం వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ మాత్రమే కాకుండా.. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత సిరాజ్ పేలవమైన ఫామ్ కూడా మరో కారణం కావచ్చు. గణాంకాల ప్రకారం.. 2023 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం నుంచి సిరాజ్ ఇప్పటివరకు 20 వన్డేలు ఆడి కేవలం 22 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ కాలంలో మహ్మద్ సిరాజ్ బౌలింగ్ సగటు 38.36గా నమోదైంది. సిరాజ్ కెరీర్ వన్డే బౌలింగ్ సగటు (25.32) తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కొన్ని మ్యాచుల్లో రాణించినప్పటికీ.. పరుగులను నియంత్రించడంలో, స్థిరంగా వికెట్లు తీయడంలో సిరాజ్ విఫలమయ్యాడు.

మరోవైపు యువ పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ లభించిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంటూ రాణిస్తున్నారు. దీంతో సిరాజ్‌కు సుదీర్ఘ విశ్రాంతిని ఇచ్చి, రాబోయే టెస్ట్ సిరీస్‌ల కోసం అతడిని తాజాగా ఉంచడంతో పాటు, ఇతర పేస్ ప్రత్యామ్నాయాలను పరిశీలించడానికి సెలెక్టర్లు ఇదే సరైన సమయమని భావించినట్లు స్పష్టమవుతోంది.

Story first published: Sunday, June 21, 2026, 15:52 [IST]
Other articles published on Jun 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+