చీప్ అండ్ బెస్ట్: ఐపీఎల్ వద్దు.. పాకిస్థాన్ లీగే ముద్దు!
ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన లీగ్ అయినప్పటికీ.. కొందరు ప్లేయర్లు ఇతర కారణాల వల్ల దానికి దూరంగా ఉంటుంటారు. ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఈ ఏడాది ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరంగా ఉండి.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో భాగంగా కరాచీ కింగ్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్న నేపథ్యంలో మొయిన్ అలీ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను వెల్లడించారు.
కుటుంబం, కెరీర్ కోసమే..
ప్రస్తుతం తనకు 38 ఏళ్ల వయస్సు అని.. ఈ దశలో కెరీర్‌ను సాధ్యమైనంత వరకు పొడిగించుకోవాలని అనుకుంటున్నట్లు మొయిన్ అలీ వెల్లడించారు. "నేను పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎంచుకోవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. పీఎస్ఎల్ తక్కువ రోజుల్లో ముగిసే టోర్నమెంట్. ఇది నా కుటుంబంతో గడపడానికి, అలాగే నా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఐపీఎల్ సుదీర్ఘంగా సాగుతుంది కానీ పీఎస్ఎల్ షెడ్యూల్ నాకు సరిగ్గా సరిపోతుంది" అని మొయిన్ అలీ వివరించారు.

ఐపీఎల్‌లో అవకాశాల కొరత
గత ఐపీఎల్ సీజన్లో(IPL 2025) మొయిన్ అలీ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. రూ.2కోట్లకు ఆ జట్టు మొయిన్ అలీని కొనుగోలు చేసింది. అయితే గతేడాది కేవలం 6 మ్యాచ్‌ల్లో మాత్రమే అవకాశం దక్కిందని.. అందులోనూ కేవలం రెండు సార్లు మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిందని మొయిన్ అలీ గుర్తు చేసుకున్నారు. "నా కెరీర్ చివరి దశలో ఉన్నాను, ఈ సమయంలో బెంచ్‌పై కూర్చోవడం కంటే మైదానంలో ఉండి బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నాను. పీఎస్ఎల్‌లో నాకు ఆ అవకాశం దక్కుతుందని భావిస్తున్నాను" అని మొయిన్ అలీ పేర్కొన్నారు.
ఆర్థికంగా, అనుభవం కోసం..
కరాచీ కింగ్స్ జట్టులో మొయిన్ అలీ ఏడాదికి రూ.2.14 కోట్ల వేతనం అందుకుంటున్నారు. ఐపీఎల్‌తో పోలిస్తే ఇక్కడ వేతనం దాదాపు సమానంగా ఉన్నప్పటికీ.. ఆడే సమయం ఎక్కువగా ఉండటం మొయిన్ ఆలీని ఆకర్షించింది. గతంలో ఎప్పుడూ పీఎస్ఎల్‌లో ఆడిన అనుభవం లేకపోవడం కూడా ఓ కారణమని.. ఐపీఎల్, పీఎస్ఎల్ షెడ్యూల్స్ క్లాష్ అవ్వడం వల్ల ఏదో ఒకదానిని ఎంచుకోవాల్సి వచ్చిందని మొయిన్ అలీ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తన వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications