తొలి టెస్టులో ఎవరో ఒకరే!: పాండ్యానా లేక చాహాలా?, కోహ్లీ నిర్ణయం


హైదరాబాద్: బుధవారం నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు టీ20ల సిరిస్‌లో తలపడనుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి టీ20లో తలపడే తుది జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.
ఈ మేరకు ట్విట్టర్‌లో 12 మంది సభ్యులతో కూడిన జట్టుని ప్రకటించింది. అయితే, తుది జట్టులో యజువేంద్ర చాహాల్ లేదా కృనాల్ పాండ్యా ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే చోటు దక్కే అవకాశం ఉంది. ఇటీవలే వెస్టిండిస్‌తో ముగిసిన టీ20 సిరిస్‌ని పరిగణనలోకి తీసుకుంటే పాండ్యాకే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

కోహ్లీ నిర్ణయం వెనుక!
అయితే, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకునే అవకాశం లేకపోలేదు. అందుకు కారణం వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌లో టీమిండియా విజయంలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహాల్‌లు కీలకపాత్ర పోషించనున్నారు.

అవసరమైనప్పుడు జాదవ్ సేవలను సైతం
ఈ ఇద్దరితో పాటు అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ నిలకడగా రాణిస్తోన్న కేదార్ జాదవ్ సేవలను అవసరమైనప్పుడు జట్టు వినియోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ లాంటి స్పిన్ ఆల్ రౌండర్ల అవసరం జట్టుకు లేకుండా పోయింది.

వరల్డ్ కప్‌కు అతి తక్కువ సమయం ఉండటంతో
వరల్డ్ కప్‌కు అతి తక్కువ సమయం ఉండటంతో అటు వన్డేలతో పాటు ఇటు టీ20ల్లోనూ కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహాల్‌కు సాధ్యమైనంతవరకు ఎక్కువ అవకాశాలను ఇవ్వాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కృనాల్ పాండ్యాతో పోలిస్తే యజువేంద్ర చాహాల్‌కే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

హార్ధిక్ పాండ్యా దూరమైన నేపథ్యంలో
ఆస్ట్రేలియా పర్యటనకు ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా దూరమైన నేపథ్యంలో అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు కృనాల్ పాండ్యాకు ఒక ఛాన్స్ ఇచ్చినా తప్పులేదని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. తొలి టీ20లో చాహాల్ స్థానంలో పాండ్యాకు చోటు కల్పిస్తే అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం లేకపోలేదని కూడా చెప్తున్నారు.

చాహాల్‌నే ఆడిస్తే బాగుటుంది
వరల్డ్ కప్‌కు అతి తక్కువ సమయం ఉండటంతో పాండ్యా స్థానంలో చాహాల్‌నే ఆడిస్తే బాగుటుందనేది విశ్లేషకుల వాదన. చాహల్‌పై కోహ్లీ నమ్మకం ఉంచి అతడికి సాధ్యమైనన్ని అవకాశాలు కల్పిస్తే వరల్డ్ కప్ నాటికి అతడు రాటుదేలే ఛాన్స్ ఉంది. అంతేకాదు వచ్చే వరల్డ్ కప్‌లో భారత విజయంలో చాహాల్ కీలకపాత్ర పోషించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications