కొంచెమన్న సెన్స్ ఉండాలి.. ఏం బ్యాటింగ్ ఆర్డరో ఏమో.. కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపకపోవడంపై నెటిజన్ల ఫైర్

హరారే: జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత జింబాబ్వే 40.3ఓవర్లకు 189పరుగులకే ఆలౌట్ కాగా.. తర్వాత ధావన్ (81పరుగులు 113బంతుల్లో 9ఫోర్లు నాటౌట్), శుభ్‌మన్ గిల్ (82పరుగులు 72బంతుల్లో 10ఫోర్లు 1సిక్సర్ నాటౌట్) రాణించడంతో 190 పరుగుల లక్ష్యాన్ని భారత్ 30.5ఓవర్లలోనే ఛేదించి 10వికెట్ల భారీ తేడాతో గెలుపొందింది. ఇక కేఎల్ రాహుల్ సారథ్యంలో తొలిసారి భారత్ వన్డే మ్యాచ్ గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అతను బౌలింగ్లో తన తొలి స్పెల్‌లో మూడు కీలక వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. అయితే ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగకపోవడాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మ్యాచ్ ప్రాక్టీస్ కోసం తీసుకున్నారా లేక..?
ఈ సిరీస్‌కు తొలుత ధావన్ కెప్టెన్‌గా ఎంపికైనప్పటికీ.. ఫిట్‌నెస్ సాధించాడన్న నెపంతో కేఎల్ రాహుల్‌ను హుటాహుటిన జట్టులోకి ఎంపిక చేయడంతో పాటు.. ధావన్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అయితే ధావన్‌ను వైస్ కెప్టెన్‌గా చేశారు. బీసీసీఐ కేఎల్ రాహుల్‌ను ఈ సిరీస్‌కు తీసుకోవడానికి ప్రధాన కారణం.. అతనికి ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ ముందు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ కావాలని.
ఎందుకంటే.. గత కొన్ని నెలలుగా టీమిండియాకు దూరమైన రాహుల్‌ను ఈ సిరీస్లో పూర్తి ప్రాక్టీస్ దక్కేలా చేయాలనేది బీసీసీఐ ప్లాన్. అయితే దానికి విరుద్ధంగా టీమ్ మేనేజ్ మెంట్ ధావన్, గిల్‌లను ఓపెనర్లుగా పంపించి.. కేఎల్ రాహుల్‌ను నాలుగో స్థానానికి పరిమితం చేసింది. ఇక ఓపెనర్లే విజయ లాంఛనాన్ని ముగించడంతో రాహుల్‌కు బ్యాటింగే రాలేదు. దీంతో కేఎల్ రాహుల్‌ను తీసుకున్న ఉద్దేశమొకటి.. జరుగుతుంది ఒకటి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
రాహుల్‌ను ఓపెనింగ్ చేయించాలన్న హర్ష భోగ్లే
ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే సైతం ఈ విషయమై స్పందించాడు. కేఎల్ రాహుల్ తప్పకుండా ఓపెనర్‌గా బ్యాటింగ్ చేయాల్సిందని.. అతనికి తగినంత ప్రాక్టీస్ అవసరముందని అభిప్రాయపడ్డాడు. వచ్చే రెండు మ్యాచ్‌లలోనైనా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ దిగాలని భోగ్లే పేర్కొన్నాడు. ఇక ఓ నెటిజన్ దీనిపై స్పందిస్తూ.. సెన్స్ లెస్ బ్యాటింగ్ ఆర్డర్ అని.. రాహుల్‌ను ఓపెనింగ్‌గా దించాల్సిందని అభిప్రాయపడ్డాడు. మరో నెటిజన్ ఆసియా కప్ ముందుంది.. కేఎల్ రాహుల్ చాన్నాళ్లుగా ఆడలేదు. అతనికి బ్యాటింగ్ ప్రాక్టీస్ కావాలి.. జింబాబ్వేతో మ్యాచ్‌లో అతనికి బ్యాటింగ్ రావాలంటే ఓపెనింగే చేయించాలి. ఇకనైనా ఆలోచించి బ్యాటింగ్ ఆర్డర్ ప్రకటించండి అంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు.

తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్(కెప్టెన్), దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్
జింబాబ్వే: మరుమణి, ఇన్నోసెంట్ కాయ, సీన్ విలియమ్స్, వెస్లీ మధేవెరే, సికందర్ రజా, చకాబ్వా (కెప్టెన్, వికెట్ కీపర్), ర్యాన్ బర్ల్, లూక్ జాంగ్‌వి, బ్రాడ్ ఇవాన్స్, విక్టర్ ఎన్‌యౌచి, రిచార్డ్ ఎంగర్వా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications