For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెలెక్టర్ల గురించి ఏమైనా మాట్లాడుకోండి.. నా భార్య పేరును తీసుకురావడం ఎందుకు?: కోహ్లీ

Why join Anushka Sharmas name with selectors: virat Kohli on Farokh Engineers tea claim

ముంబై: సెలెక్టర్ల గురించి ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడుకోండి. కానీ.. నా భార్య అనుష్క శర్మ పేరును మధ్యలో తీసుకురావడం ఎందుకు? అని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ప్రశ్నించాడు. ప్రతీ ఒక్కరికి తన భార్య సులువైన లక్ష్యంగా మారిందని కోహ్లీ ఆవేదన చెందాడు. ప్రపంచకప్ 2019 సమయంలో అనుష్కకు ఓ సెలెక్టర్‌ టీ అందించాడంటూ ఇటీవల మాజీ ఆటగాడు ఫరూఖ్‌ ఇంజనీర్‌ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై కోహ్లీ పైవిధంగా స్పందించాడు.

నా భార్య పేరెందుకు?:

నా భార్య పేరెందుకు?:

కోహ్లీ శనివారం మీడియాతో మాట్లాడుతూ... 'శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌ను చూసేందుకు అనుష్క స్టేడియానికి వచ్చింది. అనుష్క ఇద్దరు స్నేహితులతో కలిసి ఫ్యామిలీ బాక్స్‌లో కూర్చుంది. సెలెక్టర్ల బాక్స్‌ వేరేగా ఉంటుంది. ఆమెతో ఏ సెలెక్టర్‌ లేడు. అనుష్క సెలెబ్రిటీ కాబట్టి ఆమె పేరును వివాదాల్లోకి లాగి కొందరు లాభపడుతున్నారు. సెలెక్టర్ల గురించి ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడుకోండి. కానీ.. నా భార్య పేరును మధ్యలో తీసుకురావడం ఎందుకు?. అదేపనిగా అబద్ధాలు చెబితే నిజమవుతాయనే ఉద్దేశంతోనే అనుష్క ఇటీవల స్పందించింది' అని అన్నారు.

అనుష్కకు టీ కప్పులు అందించారు:

అనుష్కకు టీ కప్పులు అందించారు:

'టీమిండియాకు మిక్కీమౌజ్‌ సెలక్షన్‌ కమిటీ దొరికింది. కోహ్లీ జట్టు ఎంపికపై తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. అతడు ఏది చెపితే సెలక్టర్లు అదే చేస్తున్నారు. సెలక్టర్లకు ఉన్న అర్హతలేంటి?. అంతా కలిపి కనీసం 12 టెస్టులైనా ఆడలేదు. ప్రపంచకప్‌ కోసం ఇంగ్లాండ్‌కు వచ్చిన సెలక్టర్లలో ఒకరిని నేను గుర్తుపట్టలేకపోయా. టీమిండియా బ్లేజర్ ధరించడంతో ఎవరని ప్రశ్నించా. సెలక్టరని చెప్పాడు. అందరూ అనుష్క శర్మకు టీ కప్పులు అందించారు. వెంగ్‌సర్కార్‌ స్థాయి వ్యక్తులు సెలక్షన్‌ కమిటీలో ఉండాలి' అని గతంలో ఫరూఖ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నా సొంత ఖర్చులతో వెళ్లా:

నా సొంత ఖర్చులతో వెళ్లా:

ఫరూఖ్‌ వ్యాఖ్యలపై అనుష్క కూడా ఘాటుగానే స్పందించింది. 'విమర్శలు చేసేవారు చాలాసార్లు నా గురించి తప్పుగానే చెబుతున్నారు. ఇదే మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూ ఉంది. అర్థం లేని అబద్ధాలతో కూడిన విమర్శలకు, కామెంట్లకు స్పందించడం ఇష్టం లేకే ఇంతకాలం మౌనంగా ఉన్నా. దీనికి ఈ రోజైనా ముగింపు దొరకాలని స్పందిస్తున్నా. కోహ్లీ ప్రదర్శన బాగా లేనప్పుడు నన్ను టార్గెట్‌ చేశారు. దీనిపై కోహ్లీ వివరణ ఇస్తూనే ఉన్నాడు. కోహ్లీ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు నా సొంత ఖర్చులతోనే వెళుతున్నా. ఎవరైనా అడిగిన క్రమంలో గ్రూప్‌ ఫోటోకి ఫోజిచ్చినా నన్నే విమర్శిస్తున్నారు' అని అనుష్క మండిపడ్డారు.

వివాదాల్లోకి నా పేరు లాగొద్దు:

వివాదాల్లోకి నా పేరు లాగొద్దు:

'ప్రపంచకప్‌ మ్యాచ్‌లో సెలక్టర్లు నాకు టీ అందించారనడం చెడు ఉద్దేశంతో చెప్పిన అబద్ధం. టోర్నీలో నేను ఒక్క మ్యాచే చూశాను. అదీ ఫ్యామిలీ బాక్స్‌లో ఉండి చూశా. సెలెక్టర్ల బాక్స్‌లో నేను కూర్చోలేదు. మీరు సెలెక్షన్‌ కమిటీపైనా, వారి అర్హతలపైనా ఏవైనా విమర్శలు చేయాలనుకుంటే చేసుకోండి. అది మీ ఇష్టం. కానీ.. వివాదాల్లోకి నా పేరును లాగొద్దు. దురుద్దేశంతో కూడిన వ్యవహారాల్లో నా పేరును వాడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. నన్ను ఇక్కడితో వదిలేయండి' అని అనుష్క పేర్కొన్నారు.

ఫరూక్‌ ఇంజినీర్‌ యూటర్న్‌:

ఫరూక్‌ ఇంజినీర్‌ యూటర్న్‌:

తర్వాత అనుష్క శర్మ, బీసీసీఐ సెలెక్టర్లపై చేసిన వ్యాఖ్యలపై ఫరూక్‌ ఇంజినీర్‌ యూటర్న్‌ తీసుకున్నారు. తాను జోక్‌ చేశానని, చిన్న విషయాన్ని పెద్దగా చేసి చూపుతున్నారని ఫరూక్‌ వివరణ ఇచ్చారు. అంతేకాదు అనుష్క శర్మ మంచి అమ్మాయి. ఆమెకు క్షమాపణలు చెబుతున్నా అని అన్నారు. ప్రపంచకప్‌ సమయంలో ఒకతను టీమిండియా బ్లేజర్‌ వేసుకోవడమే దీనికి కారణమని సమర్థించుకున్నారు.

Story first published: Sunday, December 1, 2019, 11:36 [IST]
Other articles published on Dec 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+