
8వ సంవత్సరాల పాటు రూట్ కష్టపడాలి
1987లో గవాస్కర్ టెస్టుల్లో 10,000 పరుగుల మైలురాయిని అధిగమించిన తొలి బ్యాటర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక జో రూట్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ ద్వారా 10వేల పరుగుల మార్క్ అందుకున్నాడు. అలిస్టర్ కుక్ తర్వాత టెస్టుల్లో 10,000 పరుగులు పూర్తి చేసిన ఇంగ్లాండ్ బ్యాటర్‌గానూ, అతి చిన్న వయసు బ్యాటర్‌గాను రూట్ నిలిచాడు.
ఇక టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డ్ గురించి గవాస్కర్ మాట్లాడుతూ.. 'సచిన్ టెండూల్కర్ అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డు అధిగమించలేనిది, ఇక రూట్ సచిన్ రికార్డును బద్ధలు కొట్టాలంటే.. దాదాపు 6000పరుగులు అతను చేయాలి. రాబోయే 8సంవత్సరాలపాటు సుమారు 1000పరుగులు లేదా 800పరుగుల ఏడాది సగటుతో రూట్ రాణించాల్సి ఉంటుంది' అని గవాస్కర్ పేర్కొన్నాడు.

ప్రస్తుతం 12వ స్థానంలో ఉన్న రూట్
జో రూట్ ప్రస్తుతం టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 12వ స్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్ ప్లేయర్లలో రెండో స్థానంలో ఉన్నాడు. రూట్ టెస్టుల్లో సచిన్ రికార్డును అధిగమించడంలో ప్రధాన ఇబ్బంది మానసిక అలసట.కొన్ని సార్లు మెంటాల్ అప్సేట్ కు గురైతే బ్యాటర్ ఫామ్ కోల్పోతాడు. తద్వారా అతని బ్యాటింగ్ పతనానికి దారితీస్తుందని గవాస్కర్ పేర్కొన్నాడు.

మానసికంగా, శారీరకంగా అలసిపోతాడు
సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. 'అలిస్టర్ కుక్ రిటైరయ్యాడు. కానీ అతను ఇప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడుతుంటాడు. నా ప్రకారం.. కొన్నిసార్లు రౌండ్ ది క్లాక్ ప్లేయర్లు ఆడుతుంటే మానసికంగా అలసిపోతుంటారు. తద్వారా వారి ఫామ్ కూడా దెబ్బతింటుంది. ప్రస్తుతం రూట్ 150+ పరుగుల స్కోర్ చేస్తున్నాడు. కానీ అతను తర్వాత్తర్వాత మానసికంగా, శారీరకంగా అలసిపోతాడు. తద్వారా అతని ఫామ్ దెబ్బతింటుంది' సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.

క్రికెట్లో ఏదైనా సాధ్యమే
'క్రికెట్లో ఏదైనా సాధ్యమే. మనం తొలుత రిచర్డ్ హ్యాడ్లీ యొక్క 431వికెట్ల (అత్యధిక వికెట్ల రికార్డ్) బ్రేక్ కాదని అనుకున్నాం. కానీ ఆ రికార్డును అధిగమించారు. మా తరంలోని కోర్ట్నీ వాల్ష్ ఆ రికార్డును అధిగమించి టెస్ట్‌ల్లో 519వికెట్లు తీశాడు. ప్రస్తుతం 519వికెట్ల రికార్డు సాధారణం అయిపోయింది. మనం టెస్టుల్లో అత్యధిక వికెట్ల రికార్డులో చాలా ముందున్నాం. అలాగే అత్యధిక పరుగుల రికార్డు సైతం అసాధ్యమైనది కాదు, కానీ చాలా కష్టమైనది' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.

టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో రూట్
జో రూట్ ప్రస్తుతం న్యూజిలాండ్‌తో ఇంగ్లాండ్ తరపున తన 119వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇక ఆల్ టైమ్ అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్‌లలో ఒకడిగా రూట్‌ను ప్రస్తుత, మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. అతను ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) పురుషుల టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన మార్నస్ లాబుషేన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.
ఇకపోతే ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ డ్రా దిశగా సాగుతోంది. ఇక న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 553పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 539పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 4వ రోజు ఆట ముగిసే టైంకి న్యూజిలాండ్ 224పరుగులకు 7వికెట్లు కోల్పోయింది. ఫలితంగా 238పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.


Click it and Unblock the Notifications












