న్యూఢిల్లీ: ప్రపంచకప్ అంటే.. ఆయా దేశాల్లో ఉత్సాహం ఎంతుంటుందో అందరికీ తెలిసిందే. క్రికెట్ అంటే పడిచచ్చే అభిమానులతో పాటు దానిని వ్యతిరేకించే వర్గం కూడా ఉంది! క్రికెట్ వల్ల ఏమాత్రం సంతోషించరు! జీహాదీలు క్రికెట్‌ను తమ పవిత్ర యుద్ధానికి బ్యాడ్ ఐడియాగా భావిస్తారు.
లష్కరే తోయిబా ప్రయివేటుగా సర్క్యులేట్ చేసే ఓ మేగజైన్‌లో ప్రపంచకప్ ఉత్సాహం పైన విమర్శలు గుప్పించిందని సమాచారం.
వృధా సమయం
వివరాల మేరకు.. క్రికెట్ పేరుతో ఒకరోజును వృధా చేస్తున్నారు. అదే సమయంలో జీహాద్ కోసం మాత్రం వారు సమయం కేటాయించలేకపోతున్నారు. జీహాద్ రిలీజియన్ తప్పితే క్రికెట్ కాదని తాలిబన్‌కు చెందిన 'జార్బ్ ఈ తైబా' మేగజైన్‌లో పేర్కొన్నారు.

ముఖ్యంగా ఆ మేగజైన్ పాకిస్తాన్ క్రికెట్ అభిమానులను ఉద్దేశించి పేర్కొంది. పాకిస్తాన్ అభిమానుల పైన అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచకప్ పైన ఇంత ఉత్సాహానికి తెరపడాలని ఆ పత్రికలో పేర్కొన్నారు. ఆ సమయాన్ని మరింత మంచిదారి కోసం ఉపయోగించాలని.. జీహాద్‌ను ఉద్దేశించి చెప్పారు.
మనం మతం పైన దృష్టి పెట్టాలని, ఇది త్రెట్‌లో ఉందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. క్రికెట్ బ్యాట్లను పక్కన పెట్టి కత్తులు తీసుకోవాలని పేర్కొంది.
క్రికెట్ కోసం ఆత్మహత్యలు
మ్యాచ్‌లలో తమ జట్టు ఓడినప్పుడు అభిమానులు కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొంది. దానిని ప్రశ్నించింది. కాశ్మీర్ కోసం మన వారు పోరాడి.. తమ జీవితాలను పోగొట్టుకున్నప్పుడు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా అని ప్రశ్నించింది.
క్రికెట్ అనేది మత్తువంటిదని పేర్కొంది. క్రికెట్‌కు అంత ప్రాధాన్యత ఎందుకిస్తారని ప్రశ్నించింది. క్రికెట్ కంటే జీహాద్ చాలా ముఖ్యమైనదని పత్రిక పేర్కొంది. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు సెలవులు తీసుకునే ఉద్యోగుల పైన మండిపడింది. తాము చాలాసార్లు జీహాద్ కోసం పిలుపునిచ్చామని, ఎప్పుడైనా సెలవులు పెట్టారా అని ప్రశ్నించింది.
పబ్లిసిటీ స్టంట్
పాకిస్తాన్‌లో శ్రీలంక క్రికెట్ ఆటగాళ్ల పైన దాడి జరిగినప్పుడు.. పాకిస్తాన్‌ను బ్యాన్ చేశారని పేర్కొంది. దాని పైన ఇంటెలిజెన్స్ బ్యూరో ఆందోళన వ్యక్తం చేసిందని అభిప్రాయపడ్డారు. దానికి జీహాదీ కలర్ ఇచ్చారన్నారు. క్రికెట్ లేదా దానికి సంబంధించిన అంశాలపై దాడులు చేస్తే తీవ్రవాద గ్రూపులు ముందే హెచ్చరిస్తాయని తెలిపింది. కాగా, క్రికెట్ గురించి ఇంత వ్యతిరేకంగా చెప్పిన లష్కర్ గ్రూప్‌కు ప్రైమరీ ఫండర్ దావూద్ ఇబ్రహీం.. క్రికెట్లో భారీ బెట్టింగ్స్‌కు పాల్పడే విషయం తెలిసిందే.