న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నా బౌలింగ్‌ను ఎవ్వరూ అంచనా వేయలేరు'

Why it’s difficult to play Kuldeep Yadav’s bowling? Indian spinner explains

హైదరాబాద్: సాధారణంగానే స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడం కష్టం. అలాంటిది ఎడమచేతి స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడమంటే.. అంతటి స్థాయిలో కష్టతరమైనది నా బౌలింగ్ అంటూ పేర్కొన్నాడు చైనామన్‌ బౌలర్‌(ఎడమచేతి మణికట్టు స్పిన్నర్‌)గా కుల్దీప్‌ యాదవ్‌. అంతేగాక,
తన బౌలింగ్‌ను అంచనా వేయడం సులభం కాదని పేర్కొన్నాడు. ప్రత్యక్షంగానే కాదు వీడియోల రూపంలోనూ విశ్లేషించడం కష్టమని.. తన బౌలింగ్‌ అంతు చిక్కదని పేర్కొన్నాడు.

'చాలాకాలం నుంచి టెక్నాలజీ అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. అయినా నా బౌలింగ్‌ను టెక్నాలజీ ద్వారా పట్టుకోవడం సులభం కాదు. ఒకసారి బంతిని టర్న్‌ చేసిన తర్వాత అది అవతలి బ్యాట్స్‌మన్‌ను ఆలోచనలో పడేస్తుంది. ఎలా ఆడాలో అప్పటి పరిస్థితిని మాత్రమే బ్యాట్స్‌మన్‌ డిసెడ్‌ చేసుకోవాలి' అని తెలిపాడు.

'వీడియోల ద్వారా నా బౌలింగ్‌ను అంచనా వేయడం కష్టం. అదే నన‍్ను సక్సెస్‌ ఫుల్‌ స్పిన్నర్‌గా నిలిపింది. నా బౌలింగ్‌ను అంచనా వేసే క్రమంలో చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టినా.. ఏ ఒక్క విశ్లేషకుడు నా మాయాజాలపు శైలిని పట్టుకోలేరు. అది కేవలం మ్యాచ్‌ జరుగుతున్నపుడు బ్యాట్స్‌మన్‌ ఆలోచన, ఎదురుదాడిపైన మాత‍్రమే ఆధారపడి వుంటుంది' అని వివరించాడు.

ఇంకా మాట్లాడుతూ.. మ్యాచ్‌ పరిస్థితిని బట్టి బౌలింగ్‌ను వేయడం తనకు తెలిసిన విద్య అని అన్నాడు. రెగ్యూలర్ ప్రాక్టీస్‌తో బౌలింగ్‌కు సానబెడుతున్నానని, అదే తనను వైవిధ్యమైన బౌలర్‌గా నిలుపుతోంది' అని కుల్దీప్‌ వివరించాడు. ఐపీఎల్ 2018సీజన్‌కు గాను కుల్దీప్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరపున ఆడనున్నాడు. జనవరిలో జరిగిన వేలంలో ఆ జట్టు ఇతన్ని రూ. 5.8కోట్లకు కొనుగోలు చేసింది.

Story first published: Thursday, March 22, 2018, 18:02 [IST]
Other articles published on Mar 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X