న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్యాట్స్‌మెన్లందరికీ టాప్ 1 ర్యాంకు ఇచ్చిన ఐసీసీ

Why ICC ranked every batsman number one

హైదరాబాద్: ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) సరదాగా చేసిన పని ఇప్పుడు వైరల్ అయింది. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అందరికీ నంబర్ వన్ ర్యాంక్ ఇచ్చేస్తూ.. ట్వీట్ చేసింది. అయితే అది కొద్ది సేపు మాత్రమే. ఐసీసీ సరదాగా చేసిన పని ఇది. అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్ చేసిన ట్వీట్ చూసి ఐసీసీ ఇలా అందరికీ నంబర్ వన్ ర్యాంక్ ఇవ్వడం విశేషం. ఎవరూ ఎవరి కంటే ఎక్కువ కారు అని కాన్యే వెస్ట్ ట్వీట్ చేశాడు. ఇది చూసి నువ్వు చెప్పిన తర్వాత చేయకుండా ఉంటామా అంటూ అందరికీ నంబర్ వన్ ర్యాంక్ ఇచ్చిన చార్ట్‌ను తన ట్విటర్‌లో ఐసీసీ పోస్ట్ చేసింది.

తర్వాత కొద్దిసేపటికే ర్యాంకులను ఐసీసీ మార్చేసినా.. అప్పటికే ఆ ట్వీట్ వైరల్‌గా మారిపోయింది. ఇంటర్నెట్‌లో ఐసీసీ ట్వీట్‌పై సరదాగా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం టెస్టుల్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నంబర్ వన్ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ చేయడంతో నంబర్‌వన్‌గా నిలిచాడు. అయితే రెండో టెస్ట్‌లో విఫలమవడంతో మళ్లీ అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం స్మిత్ కంటే పది పాయింట్లు వెనుకబడిన కోహ్లి.. రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక జట్టు టెస్టు ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1 నుంచి కోహ్లీసేన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడుతోంది. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా ఈ టెస్టు సిరిస్‌ను 0-5తో చేజార్చుకున్న భారత ర్యాంకింగ్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకంటే భారత్ ఖాతాలో ప్రస్తుతం 125 పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా (106) పాయింట్లతో ఆ తర్వాత వరుసగా ఆస్ట్రేలియా (106), న్యూజిలాండ్ (102), ఇంగ్లాండ్ (97)తో ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగే సిరిస్‌లో కోహ్లీసేన క్లీన్‌స్వీప్‌కు గురైతే 13 పాయింట్లను చేజార్చుకుంటుంది.

ముఖ్యంగా 2011లో నంబర్ వన్ ర్యాంక్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలై అప్పట్లో అగ్రస్థానాన్ని చేజార్చుకుంది. ఆ తర్వాత 2014లో మరోసారి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి ఐదు టెస్టుల సిరీస్‌ని 1-3తో చేజార్చుకుంది. ఇక, ఇటీవల ముగిసిన పరిమిత ఓవర్ల సిరిస్‌లో కూడా టీమిండియాకు మిశ్రమ ఫలితాలే వచ్చాయి. టీ20 సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకున్న కోహ్లీసేన వన్డే సిరీస్‌ను మాత్రం 1-2తో చేజార్చుకుంది.

Story first published: Wednesday, August 15, 2018, 16:57 [IST]
Other articles published on Aug 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X