Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ పాండ్యా 228 జెర్సీ నెంబ‌ర్‌నే ఎందుకు వేసుకుంటాడో తెలుసా?!!

Why Hardik Pandya used to sport jersey No.228 for Team India: Fans react to ICCs tweet
Do You Know Why Hardik Pandya Used To Sport Jersey No 228?

ముంబై: ప్రమాదకర కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో క్రీడాలోకం నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌తో క్రికెటర్లంతా రెండు నెలలకు పైగా ఇళ్లల్లోనే లాక్‌ అయిపోయారు. ఈ క్రమంలోనే తమ తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. కొందరు ఇంట్లో తాము చేసే పనులను అభిమానులతో పంచుకుంటుంటే.. మరికొందరు గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. మరోవైపు సోష‌ల్ మీడియా వేదిక‌గా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తోంది.

హార్దిక్ '228' జెర్సీ నెంబ‌ర్‌నే ఎందుకు వేసుకుంటాడు?

హార్దిక్ '228' జెర్సీ నెంబ‌ర్‌నే ఎందుకు వేసుకుంటాడు?

లాక్‌డౌన్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పలు ఫొటోలు షేర్ చేసి.. ఎవరో గుర్తుపట్టారా? అంటూ తమ అభిమానులను అడిగిన విషయం తెలిసిందే. ఇటీవల టీమిండియా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్​, సౌరవ్ గంగూలీల ఫొటో ట్వీట్ చేసింది. తాజాగా అభిమానుల‌కు ఓ ప్రశ్న‌ను సంధించింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా '228' జెర్సీ నెంబ‌ర్‌నే ఎందుకు వేసుకుంటాడో తెలుసా? అని ప్రశ్నించింది. పాండ్యా పరుగెడుతున్న ఫొటోను షేర్ చేసింది. అయితే ఐసీసీ చేసిన ట్వీట్‌కు ఫ్యాన్స్ త‌మదైన శైలిలో స‌మాధానాలు ఇచ్చారు.

ఏకైక డ‌బుల్ సెంచ‌రీ అదే కాబట్టి

2009లో విజ‌య్ మ‌ర్చంట్ అండ‌ర్ -16 టోర్నీలో భాగంగా ముంబై జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో బ‌రోడా త‌ర‌పున బ‌రిలోకి దిగిన హార్దిక్ పాండ్యా అద‌ర‌గొట్టాడు. 60 పరుగులకే కీలక నాలుగు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్న ద‌శ‌లో పాండ్యా జట్టును ఆదుకున్నాడు. ఏకంగా 228 ప‌రుగులతో రాణించాడు. త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు చేసిన ఏకైక డ‌బుల్ సెంచ‌రీ ఇదే. మరోవైపు టోర్నీలో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోరు కూడా. అందుకే '228' జెర్సీ నెంబ‌ర్‌నే వేసుకుంటున్నాడు అని ఓ అభిమాని అన్నాడు.

అత్యధిక స్కోరును సూచిస్తుంది

అత్యధిక స్కోరును సూచిస్తుంది

'అండర్ -16 రోజుల్లో బరోడా తరఫున ఆడి డబుల్ సెంచరీ (228) చేసాడు. హార్దిక్ జెర్సీ నంబర్ అతని ఫస్ట్-క్లాస్ అత్యధిక స్కోరును సూచిస్తుంది' అని మరో అభిమాని పేర్కొన్నాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)‌లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున ఆడినప్పుడు పాండ్యా.. ఇదే నెంబ‌ర్ జెర్సీ ఉన్న ధ‌రించి బ‌రిలోకి దిగాడు. అలాగే భార‌త జ‌ట్టులోకి ప్రవేశించిన త‌ర్వాత కూడా ఇదే నెం. జెర్సీతో ఆడాడు. ఆరోజు తను ఆడిన ఇన్నింగ్స్ నుంచి స్ఫూర్తి పొందడానికి పాండ్యా ఆ నెంబ‌ర్ జెర్సీని దరిస్తున్నాడని మరో అభిమాని ట్వీట్ చేసాడు.

వెన్నుగాయంతో టీమిండియాకు దూరం:

వెన్నుగాయంతో టీమిండియాకు దూరం:

గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌ పాండ్యా .. శస్త్ర చికిత్స తర్వాత గత ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ 'ఎ' పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా చివరి నిమిషంలో హార్దిక్‌ ఇంకా కోలుకోలేకపోవడంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు. పాండ్యా కోసం బీసీసీఐ కొన్ని రోజులు జట్టు ఎంపికను కూడా వాయిదా వేసింది. ఆపై దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైనా.. అది కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా జరగలేదు. హార్దిక్‌ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునే క్రమంలో రెచ్చిపోయి ఆడాడు. దేశవాళీ టోర్నీలో భాగంగా డివై పాటిల్‌ టీ20 కప్‌లో రిలయన్స్‌-1 తరఫున ఆడిన హార్దిక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

Story first published: Friday, May 22, 2020, 14:23 [IST]
Other articles published on May 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+