
కివీస్ విజయానికి చివరి ఓవర్‌లో 19 పరుగులు కావాలి
ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో న్యూజిలాండ్ విజయానికి 19 పరుగులు కావాలి. ఈ దశలో విరాట్ కోహ్లీ బంతిని పాండ్యాకు అప్పగించాడు. మొదటి బంతి స్లో బంతిగా పాండ్యా చివరి ఓవర్‌ను ప్రారంభించాడు. మొదటి బంతికి బై రూపంలో పరుగు కోసం ప్రయత్నించిన మిచెల్ శాంట్నర్ ఔట్ అవ్వడం అభిమానులు ఆనందంలో మునిగారు.

పాండ్యా చేతివేలికి గాయం
ఇక, రెండో బంతి తర్వాత మైదానంలో డ్రా చోటు చేసుకుంది. పాండ్యా విసిరిన ఈ బంతిని కివీస్ బ్యాట్స్‌మన్ కలిన్ డీ గ్రాండ్‌హామ్ స్ట్రయిట్ షాట్ బాదాడు. తనైవైపు దూసుకొచ్చిన బంతిని క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించిన పాండ్యా చేతివేలికి గాయమైంది. దీంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది.
చివరి ఓవర్‌ను విజయవంతంగా పూర్తి చేసిన పాండ్యా
వెంటనే జట్టు ఫిజియో నిపుణుడు ప్యాట్రిక్ ఫర్హర్ట్ మైదానంలోకి వచ్చి పాండ్యాకు ప్రాధమిక చికిత్స చేశాడు. దీంతో ఫిట్ అయిన పాండ్యా చివరి ఓవర్‌ను విజయవంతంగా పూర్తిచేశాడు. మూడో బంతిని గ్రాండ్‌హోమ్ భారీ సిక్సర్ కొట్టినప్పటికీ... ఆ తర్వాతి బంతులను పాండ్యా కట్టుదిట్టంగా వేయడంతో భారత్ విజయం సాధించింది.

చివరి నాలుగు బంతులు వేసే పరిస్థితి కల్పించకు
ఈ మొత్తం వ్యవహారంపై కోహ్లీ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ 'పాండ్యా చివరి ఓవర్ బాగా వేశాడు. పాండ్యా గాయపడినప్పుడు.. దేవుడా.. చివరి నాలుగు బంతులు వేసే పరిస్థితి కల్పించకు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఏడో ఓవర్ బుమ్రాకు ఇవ్వాల్సిందిగా తనకు రోహిత్ శర్మ, ధోని సూచించారని కోహ్లీ తెలిపాడు.

బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు
ఈ మ్యాచ్‌లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడని కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











