Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ధోని ఎంతో విలువైన ఆటగాడు, అతడి రిటైర్మెంట్‌పై ఎందుకు?'

Why Even Talk About MS Dhoni's Retirement:Javed Akhtar || Oneindia Telugu
Why even talk about MS Dhonis retirement: Javed Akhtar

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టన్ ధోని తన రిటైర్మెంట్‌కు సంబంధించి ఏమైనా ఆలోచన ఉంటే దానిని నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్‌ కోరగా, తాజాగా ప్రముఖ రచయిత జావెద్‌ అక్తర్‌ కూడా ధోని రిటైర్మెంట్‌ గురించి ఎందుకు మాట్లాడతారంటూ ప్రశ్నించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ టీమిండియా సెమీస్‌లోనే నిష్క్రమించడంతో ధోని రిటైర్మెంట్‌ వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ప్రపంచకప్‌ అనంతరం ధోని రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడనే ప్రచారం జరిగింది. టీమిండియా సైతం ప్రపంచకప్ గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకాలని భావించింది.

అయితే సెమీస్‌లోనే టీమిండియా ఇంటిదారి పట్టడంతో ధోని రిటైర్మెంట్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్‌పై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జావెద్ అక్తర్ తన ట్విట్టర్‌లో ధోని రిటైర్మెంట్‌పై స్పందించాడు.

"ధోని గేమ్‌ను అర్థం చేసుకునే తీరు భారత్‌కు ఎంతో ఉపయోగం. ధోని ఒక నమ్మదగిన ఆటగాడు. భారత క్రికెట్‌ జట్టుకు ధోని ఎంతో విలువైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా అతడు ఆడాల్సిన క్రికెట్‌ చాలా ఉంది. ధోని గురించి, అతని రిటైర్మెంట్‌ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?" అని అక్తర్‌ ప్రశ్నించాడు.

కాగా, అంతకుముందు లతా మంగేష్కర్‌ సైతం ధోని రిటైర్మెంట్‌‌పై "ధోని జీ. మీరు రిటైర్‌ కాబోతున్నారనే వార్తలు వింటున్నాను. దయచేసి అలాంటి ఆలోచనలు చేయకండి. దేశానికి మీ అవసరం ఎంతో ఉంది. దేశం కోసం మీరు మరేన్నొ మ్యాచ్‌లు ఆడాలి. మీ మనసులోంచి రిటైర్మెంట్‌ ఆలోచనను తీసేయాల్సిందిగా నా విన్నపం" అని ట్వీట్‌ చేశారు.

Story first published: Sunday, July 14, 2019, 18:38 [IST]
Other articles published on Jul 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+