
ప్లేఆఫ్ బెర్తుల కోసం జట్ల మధ్య సాగిన ఉత్కంఠ
ఐపీఎల్ 11వ సీజన్ మొత్తం 60 మ్యాచ్‌ల్లో సగానికి పైగా చివరి ఓవర్ వరకు రావడం విశేషం. ప్లేఆఫ్ బెర్తుల కోసం జట్ల మధ్య సాగిన ఉత్కంఠ అభిమానిని కట్టిపడేసింది. ప్రతిసారీ లీగ్ మూడొంతుల భాగం పూర్తయ్యేసరికి రెండు మూడు జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకునేవి. కానీ ఈసారి ఢిల్లీ మినహా అన్నీ రేసులో నిలిచాయి.

అన్నింటికీ దాదాపు స్టేడియాలు నిండుగా
ఐపీఎల్‌లో ఏకంగా 60 మ్యాచ్‌లు జరిగాయి. అన్నింటికీ దాదాపుగా స్టేడియాలు నిండుగా కనిపించాయి. కానీ అంతర్జాతీయ మ్యాచ్‌లకు మాత్రం స్టేడియాలు ఖాళీగా ఉంటున్నాయి. టెస్టుల సంగతి చెప్పాలంటే సరేసరి. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో జట్ల మధ్య పోటీతత్వం తగ్గడంతో ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఏ జట్టూ అంత భీకరంగా లేదు. ప్రతి జట్టూ సొంతగడ్డపై తమకు నప్పే పిచ్‌లను తయారు చేసుకుని ప్రత్యర్థుల్ని దెబ్బ తీయడమే లక్ష్యంగా పెట్టుకుంటోంది.

ప్రత్యర్థి జట్టు చేతిలో దెబ్బ తింటోంది.
అదే జట్టు మరో దేశానికి వెళ్లినపుడు ప్రత్యర్థి జట్టు చేతిలో దెబ్బ తింటోంది. హోరాహోరీ సమరాలు తగ్గిపోతున్నాయి. పైగా ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల ఓటు టీ20లకే. ఐపీఎల్ ఆ ఫార్మాట్లో జరగడమే కాదు.. గట్టి పోటీ ఉంటోంది. మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆట పరంగా ఇక్కడ ఎన్నో కొత్త విన్యాసాలు చూస్తున్నాం. ఆటేతర ఆకర్షణలూ ఉంటాయిక్కడ. మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియాల్లో వాతావరణం చూస్తేనే ఉత్సాహం వచ్చేస్తుంది.

ఐపీఎలే ఎక్కువ ఆకర్షణీయంగా తయారవుతోంది.
జట్టుతో సంబంధం లేకుండా ప్రతి మ్యాచ్‌నూ, ప్రతి ఆటగాడి విన్యాసాలనూ ఆస్వాదించే అవకాశమూ ఉంది. ఇలా అంతర్జాతీయ క్రికెట్‌తో పోలిస్తే ఐపీఎలే ఎక్కువ ఆకర్షణీయంగా తయారవుతోంది. ఎప్పుడూ చూసే క్రికెట్ కంటే.. ఐపీఎల్‌కే ప్రత్యేకమైన ‘క్రికెటైన్మెంట్ చూడటానికే అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపించే పరిస్థితి. అందుకే ఈ లీగ్ వెళ్లిపోతుంటే అంత బాధ! లీగ్ దశ తర్వాత ఫైనల్‌కు ముందు మధ్యలో రెండు రోజులు ఖాళీ పడితేనే ఐపీఎల్ అభిమానులకు ఏదో వెలితి.


Click it and Unblock the Notifications












