బెంగళూరు: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏదైనా మ్యాచ్ ఆడుతోందంటే చాలామంద్ క్రిస్ గేల్ బ్యాటింగ్ కోసం చూస్తుంటారు! అయితే, బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ లేకపోవడం చాలామందిని నిరాశపరిచిందనే చెప్పవచ్చు.
చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఆడటం లేదని చెప్పారు. దీంతో చాలామంది ప్రేక్షకులు ఆశ్చర్యపోయారని చెప్పవచ్చు.

అయితే, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు రెండు మూడు మార్పులు చేసింది. అందులో భాగంగా క్రిస్ గేల్ స్థానంలో మరొకరిని తీసుకున్నారు. గేల్ స్థానంలో ప్రపంచ కప్ ఆస్ట్రేలియా పేస్ మెన్ మిచెల్ స్టార్క్‌ను తీసుకున్నారు.
గేల్, అబు నెచిమ్, అరోన్ ఫించ్ స్థానాల్లో.. మిచెల్ స్టార్క్, హర్షాల్, సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకున్నారు. మ్యాచ్ సమయంలో లైనప్‌లో గేల్ పేరు అదృశ్యం కావడం కామెంటేటర్లను కూడా ఆశ్చర్యానికి గురి చేసిందంటున్నారు. గేల్‌కు గాయాలు కాకపోయినప్పటికీ తీసుకోలేదని చెబుతున్నారు.
చెన్నైకి ముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ 24 బంతుల్లో 10 పరుగులు కొట్టాడు. అత్యంత నెమ్మదిగా ఆడాడు. ఈ కారణంగానే అతనిని ఈ మ్యాచ్ సమయంలో పక్కకు పెట్టి ఉంటారని అంటున్నారు. అయితే, బెంగళూరు అభిమానులు మాత్రం గేల్‌ను పక్కన పెట్టడం పట్ల అప్ సెట్ అయ్యారు.