ధోని-జాదవ్ స్లో బ్యాటింగ్ వెనుక ఉన్న రహస్యం అదే! (వీడియో)

హైదరాబాద్: బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమికి ధోని-కేదార్ జాదవ్‌లే కారణమంటూ అటు అభిమానులతో పాటు ఇటు మాజీ క్రికెటర్లు సైతం తీవ్ర విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అందుకునే లక్ష్యం అయినప్పటికీ వీరిద్దరూ పరుగులు రాబట్టేందుకు చాలా ఇబ్బంది పడుతూ ఆడిన సంగతి తెలిసిందే. ఆఖరి ఓవర్లలో భారీ షాట్లకు పోకుండా కేవలం సింగిల్స్ తీస్తూ మ్యాచ్‌ని చేజార్చారని క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం స్పందించాడు.
పిచ్ పరిస్థితుల దృష్ట్యానే
పిచ్ పరిస్థితుల దృష్ట్యానే వారి బ్యాటింగ్ నెమ్మదిగా అనిపించిందని, ఫ్లాట్ వికెట్ కావడంతో బ్యాటింగ్‌కు ఏమాత్రం సహకరించలేదని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ ధోని, కేదార్ జాదవ్ భారీ షాట్ల కోసం ప్రయత్నించారని... కానీ స్లో పిచ్ కారణంగా సాధ్యం కాలేదని తెలిపాడు.

క్రెడిట్ ఇంగ్లాండ్ ఆటగాళ్లకే దక్కుతుంది
ఈ మ్యాచ్ క్రెడిట్ ఇంగ్లాండ్ ఆటగాళ్లకే దక్కుతుందని... వారు పరిస్థితులకు అనుగుణంగా ఆడి విజయం సాధించారని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో పంత్ ఎక్కడా? అని అందరు అడగారని, నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చాడంటూ ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు రోహిత్ తనదైన శైలిలో జవాబిచ్చాడు.

338 పరుగుల విజయ లక్ష్యంతో
ఈ మ్యాచ్‌లో 338 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లియాం ప్లెంకెట్ మూడు వికెట్లు తీయగా... క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీశాడు. తాజా విజయంతో ఇంగ్లాండ్ తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో గెలిస్తే ఇంగ్లాండ్ సెమీస్‌కు చేరుతుంది. ఇక, ఈ మెగా టోర్నీలో కోహ్లీసేన ఇంకా బంగ్లాదేశ్, శ్రీలంకతో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ సెమీస్‌కు వెళ్తుంది.

జానీ బెయిర్ స్టో సెంచరీ
అంతకముందు జానీ బెయిర్ స్టో(111) సెంచరీ సాధించగా బెన్ స్టోక్స్(79), జేసన్ రాయ్(66) హాఫ్ సెంచరీలతో మెరవగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లతో మరోసారి సత్తాచాటగా... బుమ్రా, కుల్దీప్‌లు తలో వికెట్ తీశారు.
{headtohead_cricket_3_2}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications