Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టోక్స్ జెర్సీని ఎందుకు వేసుకున్నానంటే?: క్రిస్టియాన్ ట్విట్టర్‌‌లో వివరణ

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన సహచర ఆటగాడు బెన్ స్టోక్స్ జెర్సీని ఎందుకు వేసుకున్నాడో పూణె బ్యాట్స్‌మెన్ డేనియల్ క్రిస్టియాన్ మ్యాచ్ అనంతరం ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అనంతరం 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులతో కోల్‌కతాపై నెగ్గింది.

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ ఆటగాడు త్రిపాఠి సత్తా చాటాడు. తన అద్భుత ప్రదర్శనతో పూణె జట్టును విజయతీరాలకు చేర్చాడు. ధనాధన్‌ బ్యాటింగ్‌తో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై విరుచుకుపడ్డాడు. అద్భుతమైన షాట్లు కొడుతూ.. అలవోకగా ఫోర్లు, సిక్సర్లు బాదేశాడు.

Why did Daniel Christian wear Ben Stokes' jersey in IPL match?

అంతర్జాతీయ అనుభవం లేకున్నా 52 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 93 పరుగులతో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్టియాన్ 55 నెంబర్ కలిగి ఉన్న బెన్ స్టోక్స్ జెర్సీని వేసుకుని క్రీజులోకి వచ్చాడు.

అయితే ఈ విషయాన్ని తర్వాత గమనించిన క్రిస్టియాన్ మ్యాచ్ అనంతరం అలా ఎందుకు జరిగిందో వివరించాడు. 'ఈరోజు అద్భుత విజయం సాధించాం. త్రిపాఠి బ్రిలియంట్ ఇన్నింగ్స్. నా జెర్సీ తోపాటు స్టోక్స్ జెర్సీని ఉతికి ఆరేశారు. అనుకోకుండా స్టోక్స్ జెర్సీని వేసుకున్నాను' అని బుధవారం రాత్రి క్రిస్టియాన్ ట్విట్టర్ ట్వీట్ చేశాడు.

కోల్‌కతా బౌలర్ కోలిన్ డీ గ్రాండ్‌హోం వేసిన ఆఖరి ఓవర్‌లో క్రిస్టియాన్ సిక్సు బాది పూణెకు విజయాన్ని అందించాడు. ఇదిలా ఉంటే మే 4 (గురువారం) డేనియల్ క్రిస్టియాన్ 34వ పుట్టినరోజు. ఈ విషయాన్ని తన ఇనిస్ట్రాగ్రామ్‌లో పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో తన పుట్టినరోజుని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+