ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వెస్టిండీస్ స్టార్ బ్యాట్సుమన్ క్రిస్ గేల్‌కు క్షమాపణ చెప్పారు. బుధవారం రాత్రి ఇంగ్లాండుతో జరిగిన మ్యాచ్‌లో గేల్ అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే. 48 బంతుల్లోనే 100 పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు.
ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ ఓ పోస్ట్‌ను ట్విట్టర్‌లో పెట్టారు. గేల్ ఆట తీరుపై బిగ్ బి ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు, ఆ తర్వాత క్షమాపణ కూడా చెప్పారు. గేల్ ఆట అద్భుతమన్నారు.
ముంబైలో నిన్ను కలుసుకోలేకపోయినందుకు క్షమాపణ చెబుతున్నానని వ్యాఖ్యానించారు. ఆటను చూశానని, అద్భుతం అన్నారు. దానికి గేల్ స్పందిస్తూ.. కలుద్దామని చెప్పాడు. గతంలో గేల్.. అమితాబ్‌కు ఓ బహుమతి పంపిన విషయం తెలిసిందే.

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో రికార్డుల మోత ప్రారంభమైంది. వెస్టిండీస్ సంచలనం క్రిస్ గేల్ ఈ రికార్డుల మోతకు తెర తీశాడు. నిన్న ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెలరేగిపోయిన గేల్... కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి 'పొట్టి ప్రపంచ కప్'లో ఫాస్టెస్ట్ సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాకుండా గేల్ వీర బాదుడు ఓవరాల్ గా మూడో వేగవంతమైన సెంచరీగా రికార్డులకెక్కింది.
ముంబై వేదికగా జరిగిన గ్రూప్-1 లీగ్ వెస్టిండీస్ - ఇంగ్లండ్ మ్యాచ్‌లో గేల్ రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఓపెనర్‌గా వచ్చిన గేల్ చివరిదాకా క్రీజులో కొనసాగాడు. 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న అతడు మరో బంతిని ఆడి అదనపు పరుగులేమీ చేయలేదు.
మొత్తం 48 బంతుల్లో 11 సిక్స్‌లు, 5 ఫోర్లతో అతడు సెంచరీ సాధించాడు. గేల్ వీర విహారంతో విండీస్ జట్టు మెగా టోర్నీలో రికార్డు విజయంతో శుభారంభం చేసింది. తన ఇన్నింగ్స్ పైన గేల్ మాట్లాడుతూ.. తనను తాను బాస్‌గా చెప్పాడు. ప్రపంచం ఎదురు చూస్తున్న దానిని ఈ రోజు బాస్ చేశాడని చెప్పాడు. గేల్ వీరవిహారం కోసం అభిమానులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.