Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వార్నర్ ఎన్నటికీ ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కాలేడు: ఎందుకంటే!

Why culprit-in-chief David Warner will never become Australian cricket team captain

హైదరాబాద్: బాల్ టాంపరింగ్‌కు పాల్పడి దేశం పరువు తీసిన ఆటగాళ్లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌ వివాదంలో కీలకపాత్ర పోషించిన ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌పై రెండేళ్లపాటు నిషేధం విధించింది.

దీంతో పాటు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఆస్ట్రేలియాకు రెండేళ్ల పాటు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా కూడా నిషేధం విధించింది. ఇక, బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన కామెరాన్‌ బాన్‌క్టాఫ్ట్‌పై తొమిది నెలల నిషేధం విధించింది. బాల్ టాంపరింగ్ వివాదాన్ని ఐసీసీ తేలిగ్గా తీసుకున్నప్పటికీ క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంది.

క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధంపై ఈ ముగ్గురు ఆటగాళ్లు మరోసారి అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. అయితే, బంతి ఆకారాన్ని మార్చేందుకు టేప్‌ను కాకుండా సాండ్‌పేపర్‌ను (గరుకైన కాగితాన్ని) ఉపయోగించినట్టు తమ విచారణలో తేలినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.

ఈ ముగ్గురు ఆటగాళ్లను దక్షిణాఫ్రికా నుంచి అర్ధాంతరంగా ఇంటికి పంపించివేసింది. వీరి స్థానంలో నాలుగో టెస్టు కోసం రెన్‌షా, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, జో బర్న్స్‌‌లు దక్షిణాఫ్రికాకు చేరుకున్నారు. అయితే క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిన ఈ బాల్ టాంపరింగ్ వివాదం పథకానికి ప్రధాన సూత్రధారి డేవిడ్‌ వార్నర్‌ అని క్రికెట్‌ ఆస్ట్రేలియా విచారణలో తేల్చింది.

బంతి ఆకారాన్ని మార్చేందుకు వార్నర్‌ చేసిన పథక రచన గురించి స్మిత్‌కు పూర్తిగా తెలుసునని పేర్కొంది. దీంతో ఈ వివాదానికి సూత్రధారి అయిన డేవిడ్‌ వార్నర్‌ ఎన్నటికీ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌ కాలేడని సీఏ స్పష్టం చేసింది. అయితే, కెప్టెన్సీ విషయంలో స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌కు ఒకింత ఊరటనిచ్చింది.

ఆస్ట్రేలియా కెప్టెన్సీని చేపట్టకుండా స్మిత్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. అలాగే కెప్టెన్సీ విషయంలో బాన్‌క్రాఫ్ట్‌పైనా రెండేళ్ల నిషేధం ఉంటుందని తెలిపింది. ఈ రెండేళ్ల కాలంలో దేశీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో వీరు కెప్టెన్సీ చేపట్టరాదని పేర్కొంది. అయితే, ఆ తర్వాత క్రికెట్‌ అభిమానుల నుంచి, అధికారుల నుంచి అనుమతి, ఆమోదం ఉంటే జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టవచ్చునని పేర్కొంది.

అంతేకాదు ఈ ఏడాది నిషేధ సమయంలో వీరు క్లబ్‌ క్రికెట్‌ ఆడవచ్చునని, ఇలా క్లబ్‌ క్రికెట్‌ ఆడుకుంటూ క్రికెట్‌ కమ్యూనిటీతో సంబంధాలు కొనసాగించేందుకు వారిని తాము ప్రోత్సహిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.

Story first published: Thursday, March 29, 2018, 7:52 [IST]
Other articles published on Mar 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+