నువు రావొద్దు: అందుకే క్రిస్ గేల్ బ్యాటింగ్ చేయలేదు
బెంగళూరు: వెస్టిండీస్ - శ్రీలంక మ్యాచ్‌లో క్రిస్ గేల్ కోసం అభిమానులు ఎదురు చూశారు. అయితే, అతను బ్యాటింగ్‌కు రాలేదు. గాయం కారణంగా అతను దూరంగా ఉన్నాడు. శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా అతను నిబంధనల మేరకు బ్యాటింగ్‌కు రాలేకపోయాడు.
గత మ్యాచ్‌లో క్రిస్ గేల్ సెంచరీతో విజృంభించిన విషయం తెలిసిందే. దీంతో శ్రీలంకతో జరిగిన మ్యాచులో అతి కోసం అభిమానులు ఎదురు చూశారు. కానీ అతను ఫీల్డింగ్ సమయంలో గాయపడ్డాడు. గాయం కారణంగా 17వ ఓవర్లో డ్రెస్సింగ్ రూంకు వెళ్లిన గేల్.. ఆ తర్వాత మళ్లీ రాలేదు.
దీంతో నిబంధనల ప్రకారం ఓపెనర్‌గా వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఫీల్డింగ్ సమయంలో మైదానం బయట ఉన్న ఆటగాడు.. బ్యాటింగులో నిర్దేశిత సమయం తర్వాత లేదా నిర్ణీత వికెట్లు పడిన తర్వాత రావాల్సి ఉంటుంది.
అయితే, దినేష్ రామ్‌దిన్ మూడో వికెట్‌గా అవుటయ్యాక క్రిస్ గేల్ బ్యాటింగ్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కానీ నిర్ణీత సమయం కాలేదని ఫోర్త్ అంపైర్ ఇయాన్ బోల్డ్ సూచించాడు. దీంతో క్రిస్ గేల్ ఆగిపోయాడు. ఐపిఎల్లో గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. దీంతో గేల్ ఆట కోసం అభిమానులు పోటెత్తారు. కానీ ఫోర్త్ ఎంపైర్ నో చెప్పడంతో అభిమానులు నిరాశ చెందారు.

క్రిస్ గేల్
శ్రీలంకతో బెంగళూరులో జరిగిన మ్యాచ్ కోసం క్రిస్ గేల్, ఇతర ఆటగాళ్లు బాగా ప్రాక్టీస్ చేశారు. బ్రావోతో కలిసి రెండు రోజుల క్రితం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న క్రిస్ గేల్

క్రిస్ గేల్
శ్రీలంకతో బెంగళూరులో జరిగిన మ్యాచ్ కోసం క్రిస్ గేల్, ఇతర ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. చిన్నస్వామి స్టేడియంలో తోటి ఆటగాళ్లతో క్రిస్ గేల్.

క్రిస్ గేల్
అంతకుముందు, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్.

క్రిస్ గేల్
వెస్టిండీస్ క్రికెట్ స్టార్ క్రిస్ గేల్.. వరల్డ్ కప్ ట్వంటీ 20 కోసం పక్షం రోజుల క్రితం ఎన్ఎస్సీబీఐ విమానాశ్రయంలో దిగిన దృశ్యం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications