
ఫాంలో లేడు
సురేష్ రైనాను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకోకపోవడానికి అతని ఫామే ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. గత రెండు మూడేళ్లుగా అంతగా ఫాంలో లేడు. బ్యాటర్‌గా రాణించలేకపోతున్నాడు. గతంలో మాదిరిగా పరుగులు రాబట్టలేక పోతున్నాడు. గత సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన రైనా కేవలం 17 సగటుతో 160 పరుగులే చేశాడు. 2020లో ఐపీఎల్‌కు దూరంగా ఉండగా.. 2019లోనూ పెదగా రాణించలేకపోయాడు. ఆ ఏడాది 17 మ్యాచ్‌లు ఆడి 23 సగటుతో 383 పరుగులు మాత్రమే చేశాడు. ఇలా ఫాంలో లేకపోవడంతోనే సీఎస్కే పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. అలాగే వయస్సు కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడున్న 35 ఏళ్ల వయసులో టీ20 ఫార్మాట్లో రైనా రాణించలేడని సీఎస్కే భావించినట్లు సమాచారం. ఇప్పటికే రైనా ఆడే ప్లేసుకు సీఎస్కే మేనేజ్‌మెంట్ మొయిన్ అలీని సిద్ధం చేసింది. అతను గత సీజనల్లో రాణించాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు
లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా, మంచి ఫినిషర్‌గా భారత జట్టులో కొనసాగిన రైనా ఆ తర్వాత క్రమంగా ఫాం కోల్పోయాడు. దీంతో 2018లో రైనాను సెలెక్టర్లు పక్కనపెట్టారు. ఆ తర్వాతి దేశవాళీ లీగ్‌లు, ఐపీఎల్‌లో రాణించి మళ్లీ టీమిండియా తలుపు తట్టాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఇప్పటికే యువ ఆటగాళ్లు టీమిండియాలో పాతుకుపోయారు. చేసేదేమి లేక మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడు. దీంతో రైనా స్టార్ డమ్ కూడా పడిపోయింది. సత్తా తగ్గిపోయింది. ఐపీఎల్‌లో, దేశవాలీ లీగ్‌ల్లోనూ రాణించలేకపోయాడు. ఇవి కూడా రైనాను సీఎస్కే రిటైన్ చేసుకోకపోవడానికి కారణాలని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

ధర ఎక్కువ
చెన్నై సూపర్ కింగ్స్ జట్లులో స్టార్ ఆటగాడిగా ఉన్న సురేష్ రైనాకు అదే రేంజులో డబ్బులు కూడా ఇచ్చారు. రైనాకు గతంలో సీఎస్కే 11 కోట్ల రూపాయలను చెల్లించింది. కానీ ప్రస్తుతం ఫాంలో లేకపోవడంతో గతంలో మాదిరిగా భారీగా వేతనం ఇవ్వడానికి సీఎస్కే మేనేజ్‌మెంట్ ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అందుకే రైనాను వేలంలోకి వదిలేసినట్లు సమాచారం. ఎంతో కాలంగా తమను అంటిపెట్టుకుని ఉన్న రైనాను వేలంలో సీఎస్కే కొనుగోలు చేసే అవకాలు ఉన్నాయి. దీనికి ధోనికి చాలా దగ్గరి వాడు కూడా కావడంతో సీఎస్కే రైనాను అంత సులువుగా వదలకపోవచ్చు.

రైనా రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 205 మ్యాచ్‌లు ఆడిన సురేష్ రైనా 32 సగటుతో 5,528 పరుగులు చేశాడు. ఇందులో 39 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అత్యధిక స్కోర్ 100 పరుగులు. ఈ క్రమంలో 506 ఫోర్లు, 203 సిక్స్‌లు బాదాడు.


Click it and Unblock the Notifications
