For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ind vs Eng 3rd ODI: ఎందుకు బుమ్రా ఆడట్లేదు..? ఎందుకు అర్షదీప్‌ను తీసుకోలేదు..? ఎందుకు సిరాజ్ ఆడుతున్నాడు..?

Why Bumrah Ruled Out from Decider Match? Why Arshdeep not In Place Of Bumrah?

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడోది మరియు డిసైడర్ అయిన ఆఖరి వన్డేకు జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు దూరం అయ్యాడు. అతను వెన్నునొప్పితో బాధపడుతుండడంతో చివరి వన్డే నుంచి తప్పిస్తూ జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీసీసీఐ అప్‌డేట్ కూడా ఇచ్చింది. బుమ్రా ప్రస్తుతం సిరీస్‌లో బౌలింగ్ ప్రదర్శన ప్రకారం అగ్రస్థానంలో ఉన్నాడు. రెండు మ్యాచ్‌ల్లో 8వికెట్లు తీసుకున్నాడు. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో 6వికెట్లు తీసిన బుమ్రా.. ఇండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. అతని స్పెల్‌‌లో భారత్ 10వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి సిరీస్‌లో 1-0తేడాతో ఆధిక్యంలో నిలిచింది. వన్డేల్లో ఇంగ్లాండ్ మీద అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా కూడా బుమ్రా నిలిచాడు.

సమయానుసారం కట్టడి చేసే బౌలర్

సమయానుసారం కట్టడి చేసే బౌలర్

ఇక లార్డ్స్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 100పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ.. బుమ్రా తన ఖాతాలో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక కీలకమైన మూడో మ్యాచ్‌కు బుమ్రా దూరం కావడంతో.. భారత బౌలింగ్ విభాగానికి కాస్త ఇబ్బంది ఎదురుకావొచ్చు. అటాకింగ్ గేమ్‌తో చెలరేగే ఇంగ్లాండ్‌ను సమయానుసారం బుమ్రా కట్టడి చేసేందుకు ఉపయోగపడేవాడు. ఇప్పుడు బుమ్రా తరహా బౌలర్ అందుబాటులో లేకపోవడం టీమిండియాకు దెబ్బే అని చెప్పాలి.

అందుకే సిరాజ్ తుది జట్టులోకి..

అందుకే సిరాజ్ తుది జట్టులోకి..

ఇకపోతే ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతున్న చివరి వన్డేలో భారత తుది జట్టులో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్ వచ్చాడు. సిరాజ్ చివరిసారిగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడాడు. ఇకపోతే అనూహ్యంగా శార్దూల్, అర్షదీప్ సింగ్‌ను కాదని సిరాజ్‌ను తీసుకోవడం విస్తుగొలిపింది. ఇక టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్ సింగ్.. వన్డేల్లో అరంగేట్రం చేయడం మిస్సయిపోయాడు. బీసీసీఐ ప్రకారం.. ఎడమ చేతి సీమర్ అయిన అర్షదీప్ సింగ్ పొత్తికడుపు కుడి భాగంలో నొప్పితో బాధపడుతున్నాడు. అతను ఇంకా కోలుకోలేదు. అలాగే శార్దూల్ ఇటీవల ఫాం కోల్పోయాడు. దీంతో అవకాశం సిరాజ్‌కు దక్కింది.

నిప్పులు చెరుగుతున్న హార్దిక్ పాండ్యా

నిప్పులు చెరుగుతున్న హార్దిక్ పాండ్యా

ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. మాంచెస్టర్‌లో భారత్ ఇప్పటివరకు 11వన్డేలు ఆడగా.. అందులో ఐదింట గెలుపొందింది. ఆరింట ఓడిపోయింది. ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే సిరాజ్ షాకిచ్చాడు. రెండో ఓవర్లో తన తొలి స్పెల్ అందుకున్న సిరాజ్ జానీ బెయిర్ స్టో (0), జో రూట్ (0)లను డకౌట్ చేశాడు. వీరిద్దరూ ఔటయినప్పటికీ.. బెన్ స్టోక్స్ (27పరుగులు 29బంతుల్లో 4ఫోర్లు), జాసన్ రాయ్ (41పరుగులు 31బంతుల్లో 7ఫోర్లు) అడపాదడపా ఫోర్లు కొడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఇక వీరిద్దరిని హార్దిక్ పాండ్యా బుట్టలో వేశాడు. తన లైన్ అండ్ లెంత్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతను తన 4ఓవర్లలో 3 మెయిడెన్లు వేసి 2వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ ప్రస్తుతం 18ఓవర్లకు 4వికెట్లు కోల్పోయి 85పరుగులు చేసింది. క్రీజులో బట్లర్ (11), మొయిన్ అలీ (3) ఉన్నారు.

Story first published: Sunday, July 17, 2022, 17:18 [IST]
Other articles published on Jul 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+