Babar Azam : అందుకే కోహ్లీ కోసం ఆ ట్వీట్ చేశా.. క్లారిటీ ఇచ్చిన బాబర్

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో తిరిగి ఫామ్‌లోకి రావాలని పాక్ కెప్టెన్ బాబర్ ఆజం సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బాబర్ ఆజం కోహ్లీ ఫ్యాన్స్ మది దోచేశాడు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో రీస్ టాప్లీ బౌలింగ్లో మూడు అద్భుతమైన ఫోర్లు కొట్టిన కోహ్లీ లయలోకి వచ్చినట్లు కన్పించాడు. అయితే 16పరుగుల వద్ద అతను లెఫ్ట్ ఆర్మర్ అయిన డేవిడ్ విల్లీ బౌలింగ్లో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతికి కీపర్ కట్ క్యాచ్ ఔటయ్యాడు. అతను పదే పదే అదే విధంగా ఔటవుతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ మళ్లీ నిరాశపర్చడంతో కోహ్లీ అభిమానులు పూర్తిగా నిర్వేదంలోకి వెళ్లిపోయారు.

అంతవరకు ధైర్యంగా ఉండు కోహ్లీ అంటూ..
ఇక ఈ క్రమంలో బాబర్ ఆజం కోహ్లీకి సపోర్ట్‌గా చేసిన ట్వీట్ కోహ్లీ అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. దిస్ టు షల్ పాస్.. స్టే స్ట్రాంగ్ కోహ్లీ అంటూ బాబర్ ట్వీట్ చేశాడు. ఇలాంటి కఠినమైన రోజులు ముగిసిపోతాయి. అంతవరకు ధైర్యంగా ఉండు కోహ్లీ అంటూ బాబర్ ట్వీట్ చేయగా.. అది చాలా వైరలైంది. ఇక చాలా మంది కోహ్లీ, బాబర్ ఆజం కలిసి టీ20 వరల్డ్ కప్ సందర్భంగా టాస్ కోసం కలిసి వస్తున్న క్లిప్‌ను షేర్ చేస్తూ టు లెజెండరీ ప్లేయర్స్ అంటూ పోస్టులు కురిపించారు. ఇక తన ట్వీట్ గురించి బాబర్ ఆజం స్పందించాడు.

ఆ టైంలో మద్దతు అవసరం
శ్రీలంకతో ప్రారంభం కానున్న పాకిస్థాన్ టెస్టు సిరీస్‌కు ముందు బాబర్ కోహ్లీ గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు. పేలవమైన ఫామ్‌లో ఉన్నప్పుడు ఆటగాడికి మద్దతు అవసరమని పేర్కొన్నాడు. ఇక గాలేలో రేపటి నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. 'ఒక ఆటగాడిగా ఎవరైనా సరే అలాంటి దశను (ఔట్ ఆఫ్ ఫామ్) ఎదుర్కొంటారు. అలాంటి దశలో ఒక ఆటగాడు ఎలా ఫీలవుతాడో కూడా నాకు తెలుసు. ఆ సమయాల్లో తప్పకుండా ఓ సపోర్ట్ కావాలి. అందువల్లే నేను అలా సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంలో ట్వీట్ చేశాను. కోహ్లీ అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడు' అని బాబర్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.

కాస్త టైం పడుతుందంతే..!
కోహ్లీ తన కఠినమైన పాచ్ నుండి బయటపడతాడని, తిరిగి తన అత్యుత్తమ స్థితికి రాగల క్రికెటర్ అని బాబర్ చెప్పాడు. 'కోహ్లీ చాలా క్రికెట్ ఆడాడు. ఇలాంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలో అతనికి తెలుసు. దీనికి కాస్త సమయం పడుతుంది. ఇలాంటి టైంలో ఆటగాళ్లకు మద్దతు ఇవ్వడం నిజంగా చాలా అవసరం' అని బాబర్ పేర్కొన్నాడు. ఇకపోతే వన్డేలు, టీ20ల్లో నంబర్ 1 బ్యాటర్ అయిన బాబర్ ప్రస్తుతం తన అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు.అతను ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగులు సాధించడానికి చాలా చేరువలో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications