Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు మరో షాక్.. అర్షదీప్ సింగ్ టీ20 ప్రపంచకప్‌కు మిస్..? రోహిత్ చెప్పింది కరెక్టేనా?

 Why Arshdeep Singh is Missed for 3rd T2OI, is It Big Blow For India Ahead Of T20 World Cup

ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత బౌలింగ్ లైనప్ విషయంలో మరో బౌలర్ మిస్సయ్యాడు. టీమిండియాకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ తుది జట్టులో ఆడలేదు. అతను గాయం కారణంగా దూరమయ్యాడని రోహిత్ చెప్పాడు. దీంతో భారత బౌలింగ్ లైనప్‌కు ఏమవుతుంది అసలు అంటూ నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వికెట్ టేకర్‌గా ఆకట్టుకున్న అర్షదీప్ సింగ్ కూడా గాయం బారిన పడడం ఇండియా అభిమానులను కలవరపరుస్తోంది.

ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌కు బుమ్రా మిస్సవ్వడంతో ప్రస్తుతం దక్షిణాఫ్రికా సిరీస్లో ఆడుతున్న అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ మెగా టోర్నీలో బౌలింగ్ భారాన్ని మోయాల్సి ఉంది. ఎందుకంటే భువీ పవర్ ప్లే బౌలర్‌గానే రాణించగలడు గానీ డెత్ ఓవర్లలో మాత్రం చేతులెత్తేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టైంలో అర్షదీప్ సింగ్ గాయం బారిన పడి ఫైనల్ మ్యాచ్‌కు దూరం కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అర్షదీప్ గాయం గురించి రోహిత్ ఏమన్నాడంటే..

అర్షదీప్ గాయం గురించి రోహిత్ ఏమన్నాడంటే..

ఇకపోతే మూడో టీ20లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. 'మేము ముందుగా ఫీల్డింగ్ చేయాలనుకుంటున్నాం. ఇది చాలా ఎక్కువ స్కోరింగ్ గ్రౌండ్. మా ముందు ఉన్న లక్ష్యం ఏమిటో తెలుసుకోవడం ఉత్తమం. ఈ మ్యాచ్‌లో పిచ్ పెద్దగా మారదని నేను భావిస్తున్నాను.

మా జట్టు తరఫున మూడు మార్పులు జరిగాయి. రోహిత్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్ మిస్సయ్యారు. అర్షదీప్ సింగ్‌కు వెన్ను గాయమైంది. అయితే అది అంత పెద్ద సమస్యేం కాదు. కానీ ముందు జాగ్రత్తగా అతన్ని తప్పించాం. త్వరలోనే మళ్లీ జట్టుకు అందుబాటులోకి వస్తాడు. చింతించాల్సిన పని లేదు. శ్రేయాస్ అయ్యర్, ఉమేష్ యాదవ్, సిరాజ్‌లను తుది జట్టులో ఆడిస్తున్నాం. మేము మమ్మల్ని మేం సవాలు చేసుకుంటూ.. బ్యాటింగ్ బాగా చేయాలనుకుంటున్నాం.' అని రోహిత్ అన్నాడు.

రోహిత్ మాటలు నమ్మొచ్చా?

రోహిత్ మాటలు నమ్మొచ్చా?

ఇక అర్ష గాయం విషయంలో రోహిత్ అంత పెద్ద ప్రాబ్లమ్ లేదని చెప్పినప్పటికీ.. అతని మాటలు నమ్మొచ్చా అనేది డౌటే. ఎందుకంటే టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇటీవల ఎవరు జట్టుకు దూరమైన తొలుత చిన్న ప్రాబ్లమే.. ఇబ్బందేం లేదంటూ నొక్కి వక్కాణిస్తున్నారు. మొన్న బుమ్రా విషయంలోను ద్రావిడ్ ఇలాగే చెప్పాడు. బుమ్రాను మానిటరింగ్ చేస్తున్నాం. కోలుకునే అవకాశాలున్నాయంటూ పేర్కొన్నాడు. కానీ బుమ్రాకు అయిన వెన్ను గాయం చాలా తీవ్రమైందని, టీ20 ప్రపంచకప్‌కు అతను మిస్సయ్యాడని బీసీసీఐ చావు కబురు చల్లగా చెప్పింది. ఇప్పుడు అర్షదీప్ సింగ్ కూడా వెన్ను గాయంతోనే తుది జట్టుకు మిస్సయ్యాడు. అతని గాయం తీవ్రత గురించి పూర్తి సమాచారం అందితే గానీ అతను టీ20 ప్రపంచకప్‌కు అందుబాటులో ఉంటాడో ఉండడో చెప్పలేం. ఏదేమైనా అర్షదీప్ గాయం పెద్దది కాకపోతే బాగుండు అని సగటు అభిమాని కోరుకుంటున్నాడు.

మూడో టీ20కి ఇరు జట్లు :

మూడో టీ20కి ఇరు జట్లు :

దక్షిణాఫ్రికా ( ప్లేయింగ్ XI ): టెంబా బావుమా (కెప్టెన్ ), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రిలీ రోసౌ, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగీ ఎన్‌గిడి

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్

Story first published: Wednesday, October 5, 2022, 10:17 [IST]
Other articles published on Oct 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+