3 ఏళ్ల క్రితం నాటి ధోని వీడియోని పోస్టు చేసిన ఆనంద్ మహీంద్ర!

హైదరాబాద్: ఆనంద్ మహీంద్ర... కార్పోరేట్ దిగ్గజంగా కంటే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నెటిజన్‌గా అందరికీ సుపరిచితం. తనకు నచ్చిన, ప్రేరణ కలిగించిన వీడియోలను, విశేషాలను తన ఫాలోవర్స్‌తో ఆయన పంచుకుంటూ ఉంటారు. అంతేకాదు అప్పుడప్పుడు ఆయన క్విజ్ కూడా పెడుతుంటారు.
మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్
ఈ మధ్యకాలంలో ఆనంద్ మహీంద్ర చేసిన చారులత, పేపర్ బాయ్ ట్వీట్‌లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం ఆయన తన ట్విట్టర్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి సంబంధించిన మూడేళ్ల క్రితం వీడియోని పోస్టు చేశారు. అయితే, ఈ ట్వీట్‌లో ఆనంద్ మహీంద్ర బిజినెస్ తెలివితేటలకు నెటిజన్స్ ఫిదా అయ్యారు.
3 ఏళ్ల క్రితంనాటి వీడియోని
"3 ఏళ్ల క్రితంనాటి వీడియోని నా వాట్సప్ వండర్‌బాక్స్‌లో ఈరోజు పోస్టు చేస్తున్నాను. ధోని, ఆర్మీ దుస్తుల్లో నువ్వు చాలా అందంగా ఉన్నావ్.. అదేవిధంగా నీ ప్రయాణానికి కేటాయించిన వాహనంలో నువ్వు మరింత హుందాగా కనిపిస్తున్నావు" అంటూ ఓ వీడియోని తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేశాడు.

ధోని ప్రయాణించిన వాహనం
కాగా, ధోని ప్రయాణించిన వాహనం మహీంద్ర XUV 500. ఆ వాహనాన్ని మహీంద్ర & మహీంద్ర సంస్ధ తయారు చేసింది. దీంతో తన సంస్థకు చెందిన వాహనంలో ధోని ప్రయాణించడంతో ఆనంద్ మహీంద్ర ఆ విధంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వెస్టిండిస్ పర్యటనకు ధోని దూరం
ఇదిలా ఉంటే, ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరనుంది. ఆగస్టు 3 నుంచి ఆరంభమయ్యే ఈ పర్యటన నుంచి విరామం తీసుకుని, రెండు నెలలపాటు భారత సైన్యంలో సేవలందించాలని ధోని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు నెలలు ఆర్మీకి సేవలు అందించేందుకు భారత్ ఆర్మీ ఛీఫ్ సైతం అంగీకరించారు.

లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ధోని
టెరిటోరియల్ ఆర్మీ పారాచూట్ రెజిమెంట్‌లో ధోనీ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ రెండు నెలలు ధోని పారామిలటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేయనున్నాడు. ఈ రెండు నెలలు ధోని పారాచూట్ రెజిమెంట్ విభాగంలో చేరి దేశ సైనికుడిగా సేవలందిస్తాడు. ధోని నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications