Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దుర్దినంగా మిగిలిపోతుంది: గేల్ రిటైర్మెంట్‌పై స్పందించిన హోప్

 Whole World Will Miss Chris Gayle When He Retires, Says Shai Hope

హైదరాబాద్: క్రిస్ గేల్ రిటైర్మెంట్‌ ప్రకటించిన క్షణం క్రికెట్‌లో ఒక దుర్దినంగా మిగిలి పోతుందని వెస్టిండిస్ క్రికెటర్ షాయ్‌ హోప్‌ అన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌కు ఇదే ఆఖరి వరల్డ్‌కప్. ఈ ప్రపంచకప్‌లో గురువారం ఆప్ఘనిస్థాన్‌తో ఆడిన మ్యాచ్ గేల్‌కు ఆఖరి మ్యాచ్ కావడం విశేషం.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆప్ఘనిస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌లో క్రిస్ గేల్‌ 7 పరుగులే చేసి తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఈ ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత క్రికెట్ నుంచి రిటైర్ అవుతాన‌ని క్రిస్ గేల్ ఇదివ‌ర‌కే వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్ర‌వరిలోనే ఆయ‌న ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ప్ర‌పంచ‌క‌ప్ మెగా ఈవెంట్ త‌రువాత క్రిస్ గేల్ మెరుపుల‌ను చూడ‌లేమ‌ని అభిమానులు భావించారు.

అయితే, ఆప్ఘనిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం గేల్ ప్రపంచకప్ తర్వాత తాను క్రికెట్‌కు వీడ్కోలు చెప్ప‌ద‌ల‌చుకోలేద‌ని అన్నాడు. టీమిండియాతో సిరీస్‌ ఆడిన తర్వాతే తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానంటూ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గేల్‌ రిటైర్మెంట్ అంశంపై సహచర ఆటగాడు షాయ్‌ హోప్‌ స్పందించాడు.

"గేల్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన క్షణం క్రికెట్‌లో ఒక దుర్దినంగా మిగిలిపోతుంది. యావత్‌ ప్రపంచం నిన్ను కచ్చితంగా మిస్పవుతుంది" అని పేర్కొన్నాడు. క్రిస్ గేల్ నుంచి మీరు దేనిని కోల్పోతారని ఓ విలేకరి అడిన ప్రశ్నకు గాను హోప్‌"అతను పెట్టుకునే వింత వింత సన్‌ గ్లాసెస్‌ను మిస్సవుతాం" అని సమాధానమిచ్చాడు.

Story first published: Friday, July 5, 2019, 17:22 [IST]
Other articles published on Jul 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+