న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాన్ వ్యాఖ్యలు నిజమయ్యాయి! టీమిండియాను ఓడించిన జట్లే ఫైనల్లో!

Whoever beats India will win World Cup. Michael Vaughans prediction will only be partly correct

హైదరాబాద్: ఇంగ్లాండ్‌ వేదికగా ప్రపంచకప్ ప్రారంభం కాకముందు టైటిల్ ఫేవరేట్ జట్లలో ఇండియా, ఇంగ్లాండ్‌లు ఉన్నాయి. అయితే, పైనల్ మ్యాచ్‌కు వచ్చే సరికే ఇండియా టోర్నీ నుంచి నిష్క్రమించగా... ఇంగ్లాండ్ మాత్రం 27 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరుకుంది. టీమిండియా సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టోర్నీలో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి 44 ఏళ్ల తర్వాత తమ టైటిల్‌ కలను నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. అయితే, ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ తన ట్విట్టర్‌లో టీమిండియాను ఓడించిన జట్టే వరల్డ్‌కప్‌ను ఎగరేసుకుపోతుందని ట్వీట్ చేశాడు.

టీమిండియాను ఎవరైతే ఓడిస్తారో వాళ్లదే ప్రపంచకప్

"టీమిండియాను ఎవరైతే ఓడిస్తారో వాళ్లే ప్రపంచకప్‌ గెలుస్తారు" అని మైకేల్ వాన్ చేసిన ట్వీట్ అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే, ఇప్పుడు మైకేల్ వాన్ చెప్పిన మాటలే నిజమయ్యాయి. లీగ్ దశలో టీమిండియాను ఇంగ్లాండ్ జట్టు ఓడించగా.... తొలి సెమీపైనల్లో టీమిండియా 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

టీమిండియానే అత్యుత్తమ జట్టు

ఈ ప్రపంచకప్‌లో కోహ్లీసేనను ఏ జట్లు అయితే ఓడించాయో... అవే జట్లు ఇప్పుడు ఆదివారం లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరగనున్న పైనల్లో తలపడుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ ట్వీట్‌పై టీమిండియా ఫ్యాన్స్ స్పందించారు. "మీరు చెప్పిన దాన్ని బట్టి వరల్డ్‌ కప్‌ చాంపియన్‌ కంటే టీమిండియానే అత్యుత్తమ జట్టు అని స్పష్టమవుతోంది" అని కామెంట్లు పెడుతున్నారు.

ఈ ప్రపంచకప్ స‌రికొత్త ఛాంపియ‌న్‌ను

ఈ ప్రపంచకప్ స‌రికొత్త ఛాంపియ‌న్‌ను

ఈ ప్రపంచకప్ స‌రికొత్త ఛాంపియ‌న్‌ను అందించ‌బోతోంది. ఆదివారం లండ‌న్‌లోని లార్డ్స్ మైదానంలో జ‌రిగే ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ఫైన‌ల్ మ్యాచ్ అనంత‌రం ఓ స‌రికొత్త ఛాంపియ‌న్ ప్ర‌పంచ క్రికెట్ తెర మీద ఆవిర్భ‌వించ‌బోతోంది. అది ఎవ‌ర‌నేది తేల‌డానికి మ‌రో రెండురోజులు ఆగాల్సిందే!. బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియంలో గురువారం జ‌రిగిన రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియ‌న్ ఆస్ట్రేలియా ఇంగ్లండ్ జ‌ట్టు చేతిలో మ‌ట్టి క‌రిచింది. 27 సంవ‌త్స‌రాల త‌రువాత తొలిసారిగా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో అడుగు పెట్టింది ఇంగ్లీష్ జ‌ట్టు.

27 సంవ‌త్స‌రాల త‌రువాత

27 సంవ‌త్స‌రాల త‌రువాత

ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీ కొట్ట‌బోతోంది. అటు న్యూజిలాండ్‌, ఇటు ఇంగ్లండ్‌.. జీవితంలో ఎప్పుడూ ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడ‌ని జ‌ట్లు. ఈ సారి ఈ రెండూ ఫైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌బోతున్నాయి. ఎవ‌రు గెలిచినా స‌రికొత్త చ‌రిత్రే అవుతుంది. తొలిసారి క‌ప్‌ను అందుకున్న జ‌ట్టుగా చ‌రిత్ర సృష్టిస్తుంది. ఇప్ప‌టిదాకా మూడుసార్లు ఫైన‌ల్ దాకా వెళ్లి ప‌రాజ‌యాన్ని చ‌వి చూసింది ఇంగ్లండ్ జ‌ట్టు. మూడు సార్లు ఫైన‌ల్ త‌లుపు త‌ట్టినా అదృష్టం వ‌రించ‌లేక‌పోయింది. ఇది అయిదోసారి. ఈ సారి ఫ‌లితం ఎలా ఉంటుంద‌నేది అత్యంత ఆస‌క్తిక‌రంగా మారింది.

Story first published: Friday, July 12, 2019, 13:43 [IST]
Other articles published on Jul 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X