కోహ్లీసేనను ఎవరైతే ఓడిస్తారో వాళ్లదే ఈ వరల్డ్‌కప్

హైదరాబాద్: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ఓ ఆసక్తికర జోస్యం చెప్పాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఏ జట్టైతే కోహ్లీసేనను ఓడిస్తుందో వారిదే ప్రపంచకప్ అని అన్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో "ఇది గుర్తుంచుకోండి.. ఎవరైతే టీమిండియాను ఓడిస్తారో వారే ప్రపంచకప్ విజేత అవుతారు" అంటూ ట్వీట్ చేశాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి 11 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కివీస్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో చెరో పాయింట్ లభించింది.
గురువారం మాంచెస్ట్రర్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టోర్నీలో భాగంగా టీమిండియా తన తదుపరి మ్యాచ్‌లో ఆదివారం ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ చేసన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications