Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: టాప్ స్కోర్ చేసే బ్యాటర్ ఎవరు?.. అందరి చూపూ ఈ ముగ్గురిపైనే..

Who will score more runs in second INDvsBAN ODI

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి వన్డేలో అనూహ్య ఫలితం వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. అదే సమయంలో స్వల్ప లక్ష్య ఛేదనలో పట్టుదల చూపిన బంగ్లాకు.. భారత ఫీల్డింగ్ వైఫల్యాలు కలిసొచ్చాయి. దీంతో ఈ మ్యాచ్‌ను బంగ్లా టైగర్స్ బుట్టలో వేసుకున్నారు. దీంతో రెండో వన్డేపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ మ్యాచ్‌లో కూడా భారత్ ఓడితే వన్డే సిరీస్ చేజారినట్లే. ఈ క్రమంలోనే ముగ్గురు బ్యాటర్లపై అందరి చూపూ ఉంది.

శ్రేయాస్ అయ్యర్

శ్రేయాస్ అయ్యర్

ఈ ఏడాది వన్డేల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా యువ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్. భారత బ్యాటింగ్ లైనప్‌లో నాలుగో నెంబర్ స్థానాన్ని పదిలం చేసుకుంటున్న శ్రేయాస్.. బంగ్లాతో తొలి వన్డేలో ఫర్వాలేదనిపించాడు. అందకుముందు కివీస్ పర్యటనలో కూడా మిగతా ఆటగాళ్లు విఫలమైనా ఒంటరి పోరాటం చేశాడు. అలాంటి శ్రేయాస్.. బంగ్లాపై కూడా సత్తా చాటితే జట్టులో అతని స్థానం పదిలం అవుతుంది. ఈ నేపథ్యంలోనే రెండో వన్డేలో సత్తా చాటాలని శ్రేయాస్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.

లిటన్ దాస్

లిటన్ దాస్

వెటరన్ తమీమ్ ఇక్బాల్ లేకపోవడంతో బంగ్లా జట్టు పగ్గాలు అందుకున్న ఓపెనింగ్ బ్యాటర్ లిటాన్ దాస్.. తొలి వన్డేలో జట్టుకు అవసరమైన కీలక పరుగులు చేశాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న అతను.. రెండో వన్డేలో కూడా రాణించి జట్టుకు మరో విజయం అందించాలని ఉత్సాహంగా ఉన్నాడు. సాధారణంగానే భారత్‌పై చెలరేగి ఆడే దాస్.. సీనియర్లు లేని భారత బౌలింగ్‌ను చెండాడాలని అనుకుంటున్నాడు.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

విశ్రాంతి తర్వాత మంచి టచ్‌లో కనిపించిన కోహ్లీ.. టీ20 ఫార్మాట్‌లో అదరగొట్టాడు. ఇదేే జోరులో అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్‌లో కూడా రాణిస్తాడని అభిమానులు అనుకున్నారు. అయితే తొలి వన్డేలో దురదృష్టవశాత్తూ అవుటయ్యాడు. లిటాన్ దాస్ అందుకున్న సూపర్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. రెండో వన్డేలో మాత్రం పాత కోహ్లీని చూడాలని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. కోహ్లీ కూడా మంచి ఫామ్‌లో ఉండటంతో అతను కూడా భారీ స్కోరు చేయాలని ఉత్సాహంగా ఉన్నట్లే కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ టాప్ స్కోరర్‌గా ఈ ఏడాది పొట్టి ఫార్మాట్‌ను ముగించిన కోహ్లీ.. రెండో వన్డేలో అయినా రాణించి ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌ను కూడా ఘనంగా ముగిస్తాడేమో చూడాలి.

Story first published: Wednesday, December 7, 2022, 10:14 [IST]
Other articles published on Dec 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+